సమ్మోహనం సక్సెస్ మీట్‌లో మహేష్ డైలాగ్ మార్చి చెప్పిన సుధీర్!
హీరో సుధీర్ నటించిన సమ్మోహనం చిత్రం మంచి విజయం దిశగా దూసుకుని పోతోంది. ప్రేమకథా చిత్రం తరువాత సుధీర్ కు సమ్మోహనం చిత్రంతో ఆ స్థాయి విజయం దక్కింది. సుధీర్, అదితి రావు హైదరి ఈ చిత్రంలో జంటగా నటించారు. సున్నితమైన కథతో భావోద్వేగాల్ని రక్తికట్టించి ఆడియన్స్ ఆకట్టుకోవడం దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ శైలి. ఈ చిత్రంలో కూడా ఆయన అదే మ్యాజిక్ చేశారు. చిత్రం మంచి విజయం దిశగా దూసుకుని పోతున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్ పాల్గొంది. సుధీర్ బాబు సక్సెస్ మీట్ లో తన ప్రసంగంతో ఆకట్టుకున్నాడు.

ప్రేమకథా చిత్రం పేరు చెరిపేసి
ప్రేమకథా చిత్రం తరువాత చాలా సినిమాలు చేశాను. ఆ చిత్రాలు కూడా బాగానే ఆడాయి. కానీ అంతా ప్రేమకథా చిత్రం సుధీర్ అనే పిలిచేవారు. కానీ సమ్మోహనం చిత్రం విడుదలయ్యాక సమ్మోహనం సుధీర్ అని పిలుస్తున్నారని తెలిపాడు.

మహేష్‌కు బాగా దగ్గరయ్యా
సమ్మోహనం చిత్రంతో మహేష్ కు బాగా దగ్గరయ్యానని సుధీర్ తెలిపాడు. బావగా ఎప్పుడూ దగ్గరగానే ఉంటా. కానీ ఈ చిత్రంతో నటుడిగా మహేష్ కు దగ్గరయ్యానని తెలిపాడు. ఈ చిత్రంతో మహేష్ తనని నటుడిగా ఇష్టపడుతున్నాడని సుధీర్ తెలిపాడు.

వారందరి సహకారంతో
ఈ చిత్రం ప్రమోషన్ కోసం చాలామంది సహకారం అందించారు. మొదట్లో చిరంజీవి, కృష్ణ, మహేష్ అందరూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ఈ చిత్రాన్ని దగ్గర చేశారని సుధీర్ తెలిపాడు.

చివర్లో మహేష్ డైలాగ్
తన ప్రసంగం చివర్లో మహేష్ డైలాగ్ ని సుధీర్ మార్చి చెప్పాడు. ఒకవేళ మీరు ఈ డబ్బులు సేవ్ చేయాలనీ పైరసీలో ఈ చిత్రాన్ని చొస్తే.. ఆ డబ్బులతో ఏదైనా కొనుక్కుని తింటే మీకు అరగదని సుధీర్ తెలపడం విశేషం.


Click it and Unblock the Notifications











