Don't Miss!
- Finance
IT News: IT రంగంలో భారత్ దూకుడు.. రెండో అతిపెద్ద IT సంస్థగా ఇండియన్ కంపెనీ
- News
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పై టీటీడీ కీలక నిర్ణయం..!!
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Hunt Twitter Review: హంట్ మూవీకి షాకింగ్ టాక్.. అసలైనవే మైనస్‌గా.. సుధీర్ బాబు పరిస్థితి ఏంటంటే!
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు తెగ కష్టపడుతోన్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలతో మెప్పించిన అతడు.. సత్ఫలితాలను మాత్రం పెద్దగా రాబట్టలేకపోతోన్నాడు. అయినప్పటికీ ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు.
కానీ, ఈ మధ్య కాలంలో హిట్ మాత్రం దక్కడం లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సుధీర్ బాబు 'హంట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

హంట్ అంటూ థ్రిల్లర్ మూవీతో
సుదీర్ఘ కాలంగా భారీ విజయం కోసం వేచి చూస్తోన్న సుధీర్ బాబు నటించిన తాజా చిత్రమే 'హంట్'. మహేశ్ సూరపనేని తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీకాంత్, భరత్ (ప్రేమిస్తే ఫేం) కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వీ ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతం అందించాడు. దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.
బిగ్ బాస్ హమీదా ఓవర్ డోస్ బోల్డు షో: ఎద అందాలను ఆరబోస్తూ ఘాటుగా!

అలాంటి స్టోరీతో వచ్చిన చిత్రం
కెరీర్ ఆరంభం నుంచి తనదైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకున్న సుధీర్ బాబు.. ఇప్పుడు 'హంట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం పోలీస్ అధికారి అయిన హీరో లేని సమయంలో అతడిలా ఉండే మరో వ్యక్తిని దించి ఓ మిషన్‌ను కంప్లీట్ చేయడం అనే కాన్సెప్టుతో తెరకెక్కినట్లు టీజర్, ట్రైలర్‌లో చూపించారు.

హంట్ మూవీకి ట్విట్టర్‌లో టాక్
విడుదలకు ముందు భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకున్న సుధీర్ బాబు 'హంట్' మూవీ ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇది కొందరు బాగుందని, మరికొందరు బాలేదని అంటున్నారు.
ఒంటిపై బట్టలు లేకుండా శృతి హాసన్: హీరోయిన్ హాట్ మసాజ్ ఫొటో వైరల్

ఫస్టాఫ్ అలా... సెకెండాఫ్ ఇలా
'హంట్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రలను పరిచయం చేయడం.. ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికే డైరెక్టర్ ఎక్కువ సమయం తీసుకున్నాడట. అయితే, ఇంటర్వెల్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుందట. కానీ, సెకెండాఫ్‌లో మాత్రం కాస్త ఎంగేజింగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇక, క్లైమాక్స్ ఓ ట్విస్టుతో కూడి ఉంటుందని ట్వీట్ల ద్వారా తెలిసింది.

మూవీలో ప్లస్.. మైనస్‌లు ఇలా
సుధీర్ బాబు 'హంట్' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో దర్శకుడు ఎంచుకున్న కథ, ట్విస్టులు, సెకెండాఫ్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్లస్ అని తెలిసింది. అయితే, సినిమా స్లోగా సాగడం, ఫస్టాఫ్, కమర్షియల్ హంగులు లేకపోవడం, విజువల్స్ ఈ చిత్రానికి మైనస్‌గా మారాయని నెటిజన్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మళ్లీ మొదలెట్టిన యాంకర్ స్రవంతి: క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయిందిగా!

ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే
ట్విట్టర్ సమాచారం ప్రకారం.. సుధీర్ బాబు నటించిన 'హంట్' మూవీ స్లోగా సాగే థ్రిల్లర్ అని చెప్పొచ్చు. కానీ, దీన్ని ప్రేక్షకులకు చేరువ చేసేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం అటు ఇటు అయిందని తెలిసింది. ముఖ్యంగా థ్రిల్‌కు గురి చేసే అంశాలు ఉన్నా వాటిని చక్కగా నడపడంలో తడబాటు కనిపించిందట. అయితే ఈ చిత్రాన్ని అన్ని వర్గాల వాళ్లూ చూడచ్చని చెప్పొచ్చు.

షార్ట్ ఫిల్మ్ కంటెంట్ అంటూ
సుధీర్ బాబు హీరోగా మహేశ్ సూరపనేని తెరకెక్కించిన 'హంట్' మూవీకి ట్విట్టర్‌లో షాకింగ్ ట్వీట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో 'విజువల్స్, స్క్రీన్‌ప్లే' షార్ట్ ఫిల్మ్‌కు తగ్గట్లుగా ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అలా ఇప్పటి వరకూ దీనిపై చాలా నెగెటివ్ ట్వీట్స్ కనిపించాయి. మరో నెటిజన్ 'హంట్ = మహేశ్ బాబు అన్ని సినిమాలు' అంటూ ట్రోల్ చేశాడు.