»   » సూప‌ర్‌స్టార్ మహేష్ తర్వాత నేషనల్ బ్రాండ్ కి సుధీర్ బాబు

సూప‌ర్‌స్టార్ మహేష్ తర్వాత నేషనల్ బ్రాండ్ కి సుధీర్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మన సౌత్ లో టాప్ బ్రాండ్ అంబాసిడర్ సూపర్ స్టార్ మహేష్ అని చెప్పాలి. థమ్స్ అప్ , నవ రత్న ఆయిల్ , యునివరసల్ ఇలా చాల బ్రాండ్స్ యాడ్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించారు. 2012 లో థమ్స్ అప్ కి నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా థమ్స్ అప్ యాడ్ లో నటించారు.

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బావ యువ హీరో సుదీర్ బాబు కూడా నేషనల్ బ్రాండ్ యాడ్ లో నటించాడు. కేవలం 5 సినిమాల్లో హీరో గా నటించిన సుధీర్ బాబు యూత్ లో చాల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సరి కొత్త పాత్రలతో ముందుకు కెరీర్ లో దూసుకుపోతున్న సుధీర్ బాబు కి నేషనల్ రేంజ్ లో పాపులారిటీ రానుంది. వివరాల్లోకి వెళితే ప్రముఖ కంపెనీ అయిన " హాల్స్ " నేషనల్ వైడ్ గా తీసే యాడ్ లో సుధీర్ బాబు కనిపించనున్నాడు. హాల్స్ కంపెనీ వాళ్ళు కొత్తగా " లెమన్ హనీ " ఫ్లేవర్ ని ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా తీసే సరి కొత్త యాడ్ లో సుధీర్ బాబు ని తీసుకున్నారు.

Sudheer Babu

సుధీర్ బాబు తాజా చిత్రం " భలే మంచి రోజు " సినిమా ఈ నెల 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. భలే మంచి రోజు సినిమా ఆడియో కి , ట్రైలర్ కి మంచి స్పందన రావడమే కాకుండా సినిమా మీద భారి అంచనాలు ఉన్నాయి. అదే విధంగా సుధీర్ బాబు " భాగి " అనే బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ హీరో గా వస్తున్న భాగి లో సుధీర్ బాబు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.

English summary
Sudheer Babu will be appearing in the upcoming TV commercial for the newly introduced Halls Lemon Honey flavor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu