ఫస్ట్ టైమ్: ఇద్దరితో రొమాన్స్ చేయబోతున్న శర్వానంద్
హీరో శర్వానంద్ తర్వాతి సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో శాలిని పాండే, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించబోతున్నట్లు సమాచారం.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల విడుదలైన 'మహానుభావుడు' సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటి వరకు శర్వానంద్ కెరీర్లో చేసిన సినిమాలన్నీ సింగిల్ హీరోయిన్ ఉన్న సినిమాలే. తొలిసారిగా ఇద్దరు భామలతో శర్వానంద్ రొమాన్స్ చేయబోతున్నారు.
శర్వానంద్ నెక్ట్స్ మూవీ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారని, వారిలో ఒకరు నివేధా థామస్, మరొకరు శాలిని పాండే అని వార్తలు వినిపిస్తున్నాయి.

మాఫియా బ్యాగ్రౌండ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ఈ చిత్రాన్ని సితార ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మించబోతున్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.


Click it and Unblock the Notifications











