శర్వానంద్, కాజల్, నిత్యామీనన్ కాంబినేషన్లో మూవీ.. సుధీర్ వర్మ డైరెక్షన్
యువ హీరో శర్వానంద్, కాజల్, నిత్యామీనన్ కాంబినేషన్‌లో దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో కొత్త చిత్రం సోమవారం (నవంబర్ 27న) ఉదయం రామానాయుడు స్థూడియోలో వైభవంగా ప్రారంభమైంది.
యువ హీరో శర్వానంద్, కాజల్, నిత్యామీనన్ కాంబినేషన్‌లో దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో కొత్త చిత్రం సోమవారం (నవంబర్ 27న) ఉదయం రామానాయుడు స్థూడియోలో వైభవంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న నిర్మిస్తున్నది.

కథానాయకుడు శర్వానంద్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్ని వేశానికి ప్రముఖ కథానాయకుడు నాగ చైతన్య అక్కినేని క్లాప్ నివ్వగా, కెమెరా స్విచ్ ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. చిత్రం స్క్రిప్ట్‌ను హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ చిత్ర దర్శక నిర్మాతలకు అందజేశారు.

ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, జెమిని కిరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం: దివాకర్ మణి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్. నిర్మాత: సూర్యదేవర నాగవంశీ కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











