త్రివిక్రమ్ నిర్మాతగా పవన్ కల్యాణ్ మూవీ.. నా దర్శకత్వంలో ఎప్పుడంటే? డైరెక్టర్ సుధీర్ వర్మ
స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటించిన రావణాసుర చిత్రం ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. అభిషేక్ నామా నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ..
రవితేజ నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత రావణాసుర సినిమా రావడం అంచనాలు ఉంటాయి. కానీ నాకు ఆ విషయంలో టెన్షన్ లేదు. నా సినిమా సక్సెస్ కావాలని నేను కోరుకొంటాను. నాకు నా సినిమా గురించే టెన్షన్ ఉంటుంది. రామారావు ఆన్ డ్యూటీ, కిలాడి మూవీస్ తర్వాత ఈ సినిమా వచ్చినా నాకు అదే టెన్షన్ ఉంటుంది. రవితేజ ముందు సినిమాల ఫలితం ఏమిటనే విషయాన్ని నేను పట్టించుకోను. నేను తీసింది సూపర్ హిట్ కావాలని కోరుకొంటాను అని సుధీర్ వర్మ అన్నారు.

రావణాసుర సినిమాను మిగితా భాషల్లో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. మొదట తెలుగు, తమిళ్ అనుకొన్నాం. ఆ తర్వాత హిందీలో కూడా రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ రావణాసుర సినిమా చాలా సెన్సిటివ్ సబ్జెక్. హిందీలో రిలీజ్ చేయాలంటే వారికి 15 రోజుల ముందు కంటెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మన వద్ద అయితే కంటెంట్ లీక్ కాకుండా మన చేతిలో ఉంటుంది. వేరే చోటికి పంపించి రిస్క్ చేయడం ఇష్టం లేకనే హిందీ రిలీజ్ చేయకూడదని అనుకొన్నాం అని సుధీర్ వర్మ చెప్పారు.
హీరో నిఖిల్‌తో సినిమా షూట్ జరుగుతుంది. త్వరలోనే ఆ సినిమా షూట్ కంప్లీట్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా వివరాలు చెబుతాను. ప్రస్తుతం రావణాసుర మూవీ ప్రమోషన్స్ తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతాను అని సుధీర్ వర్మ అన్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాకు నేను దర్శకత్వం వహిస్తాను. ఆ సినిమా ఇంకా ప్రాసెస్‌లో ఉంది. ఇంకా ఎప్పుడు మొదలవుతుందనే విషయం క్లారిటీ లేదు. ఆ సినిమా విషయంలో కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని సుధీర్ వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











