మహేష్ బావ ‘ఎస్‌ఎంఎస్’రిలీజ్ తేదీ ఖరారు
కృష్ణ మేనల్లుడు,మహేష్ బావ అయిన సుధీర్‌బాబు హీరోగా 'ఎస్‌ఎంఎస్' ('శివ మనసులో శృతి') చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆడియో పంక్షన్ జరుపుకున్న ఈ చిత్రం పిబ్రవరి 10 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సూపర్‌గుడ్ ఫిలింస్ ఆర్‌బీ చౌదరి సమర్పణలో వేగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్, హనీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విక్రమ్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ..'అన్ని వర్గాలను అలరించే ఈ ప్రేమకథలో కుబుంబ భావోద్వేగాలు కూడా మేళవించి దర్శకుడు చిత్రాన్ని చక్కగా రూపొందించాడు. తప్పకుండా సుధీర్ ఈ చిత్రంలో మంచి కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు' అన్నారు. సుధీర్ ఇంతకుముందు ఏమి మాయ చేసావే చిత్రంలో సమంతకు బ్రదర్ గా చేసాడు. నరేష్, రోహిణి, హర్షవర్ధన్, ప్రియాంక తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నా ఈ చిత్రానికి కధ: రాజేష్, తాతినేని సత్య, మాటలు:నంద్యాల రవి, కెమెరా: చిట్టిబాబు, సంగీతం: సెల్వ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రవీంద్ర రానా


Click it and Unblock the Notifications











