ఆర్.పి.పట్నాయిక్ ట్రైనింగ్ లో మహేష్ బావ

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబు బావ సుధీర్ బాబు రీసెంట్ గా ఆర్పీ పట్నాయిక్ వద్దకు వాయిస్ సరిచేసుకోవటం కోసం ట్రైనింగ్ కు వెళ్లాడు. రోజుకో గంట చొప్పున ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ వాయిస్ మనకు ఇప్పుడు ఆయన తాజా చిత్రం ప్రేమ కథా చిత్రమ్ లో వినపడనుంది.

ఎస్.ఎమ్ ఎస్ చిత్రంతో పరిచయమైన సుధీర్ బాబు..ఆ సినిమాలో యాక్టింగ్ పరంగా బాగా చేసాడని పేరు తెచ్చుకున్నా... గొంతు బాగోలేదని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో మరీ తేలిపోయిందని,పీలగా ఉందని అంతా ఫీలయ్యారు. దాంతో తనలోని లోపాన్ని సరిచేసుకునేందుకు ఇలా ట్రైనింగ్ తీసుకుని తను ఎన్నుకున్న ప్రొపిషన్ పై శ్రద్ద చూపించాడు సుధీర్.

ఇక ఈ ప్రేమ కథా చిత్రమ్ లో తన వాయిస్ విన్నవారు డబ్బింగ్ చెప్పించామనుకుంటున్నారని, అంత బాగా తన వాయిస్ సెట్ రైట్ అయ్యిందని ఆనందంతో సుధీర్ బాబు చెప్తున్నారు.

సుధీర్‌బాబు, నందిత జంటగా జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన 'ప్రేమకథా చిత్రమ్' జూన్ 7న విడుదలకు సిద్ధమౌతోంది. మారుతి సమర్పణలో ఆర్.పి.ఏ క్రియేషన్స్ అండ్ మారుతి టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మారుతి మరియు ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతలు.

ఈ సందర్భంగా నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...'సుధీర్ బాబు హీరోగా మా సంస్థలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమకథా చిత్రమ్' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇటీవలే సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నామని తెలిపారు.

ఈ రోజుల్లో, బస్టాప్ చిత్రాలకు సూపర్బ్ సంగీతం అందించిన జే.బి మా ప్రేమకథా చిత్రమ్‌కి కూడా అదే రేంజిలో సంగీతాన్ని అందించాడు. ఈ ఆడియో ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ కాగా సినిమా కూడా ఆద్యంతం అబ్యుర పరిచేలా అందరినీ ఆకట్టుకుంది. కేవలం నాలుగు పాత్రలతో ఊహించని ప్రేమకథగా తెరకెక్కింది. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లు, దర్శకత్వ పర్యవేక్షణ దర్శకుడు మారుతి నిర్వహించారు. చక్కగా వేసవిలో ఫ్యామిలీ అంతా కలిసి హీయిగా నవ్వుకునే చిత్రంగా మా ప్రేమకథా చిత్రం ఉంటుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X