నటి పాయల్ తనను బెదిరిస్తోందంటూ సుధీర్ మిశ్రా ఫిర్యాదు
ప్రముఖ ఫిల్మ్ మేకర్ సుధీర్ మిశ్రా నటి పాయల్ రోహత్గీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు బెదిరింపు మెసేజ్‌లు పంపుతోందంటూ ఆయన పాయల్‌పై తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ధరవి, హజారో ఖాయిసే ఐసీ, చమేలీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుధీర్ మిశ్రా పాయల్‌పై పోలీసులకు రాతపూర్వకమైన ఫిర్యాదు అందించారు. పాయల్ నుంచి ఆయనకు ఇటీవల విపరీతమైన మెసేజ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. విచారణ జరుపుతున్నామని, విచారణ తర్వాత కేసు నమోదు చేస్తామని డిప్యూటీ కమిషనర్ కెఎంఎం ప్రసన్న చెప్పారు.
దర్శకుడు దిబాకర్ బెనర్జీ తనకు అవమానకరమైన ప్రతిపాదనలు చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ విషయంలో మిశ్రా పాయల్‌ను ఖండిస్తూ బెనర్జీకి మద్దతుగా నిలిచారు. ఇదే పాయల్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. మెసెజ్‌ల సారాంశాన్ని వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.


Click it and Unblock the Notifications











