twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సుడిగాడు'లో 'ఈగ' స్పూఫ్ ఎలా చేసారంటే...

    By Srikanya
    |

    రాజమౌళి తాజా సూపర్ హిట్ చిత్రం ఈగ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్పూఫ్ ని అల్లరి నరేష్ తాజా చిత్రం సుడిగాడు లో పెడుతున్నారు. ఈగ మాదిరిగానే సుడిగాడు లో కూడా మొదట డైరక్టర్ వాయిస్ తో మొదలవుతుంది. ఈగలో దర్శకుడు రాజమౌళి..కూతురుకి కథ చెప్తున్నట్లుగా పెట్టినట్లుగానే ఇందులో బీమినేని శ్రీనివాసరావు..తన కూతురు కథ చెప్పమని అడిగితే ..తెలుగు హీరో కథ చెప్తానని,వాడిపేరు సుడిగాడు అని మొదలెడతారు. ఇలా సినిమా మొదటనుంచే స్ఫూఫ్ తో మొదలెడుతున్నారు.

    'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌.డి.రెడ్డి నిర్మాత. మోనాల్ గజ్జల్ ఇప్పటికే వెన్నెల వన్ అండ్ హాఫ్ చిత్రంలో చేసింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో లాంచ్ అయి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

    ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మక చిత్రాల్లో ఇదొక వైవిధ్యమైన ప్రయత్నం. విజయవంతమైన చిత్రాల్లోని పలు సన్నివేశాల పేరడీతో కథ సాగుతుంది. ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తుంది. ఇటీవలే కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కించాం. అసలు ఈ కథలో సుడిగాడు ఎవరు? అతని కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఇందులో నరేష్‌ నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది''అన్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ చిత్రం మరో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమినేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

    పింకి పింకి పోంకి ఫాదర్ హేడ్ ఎ డాంకీ అంటూ అల్లరి నరేష్ ఈ చిత్రం కోసం పాట పాడారు. తన తాజా చిత్రం 'సుడిగాడు'కోసం ఆయన స్వయంగా ఈ పాటను పాడారు. మొత్తం ఓ ఫ్యామిలీ సాంగ్ గా ఈ పాట తెరకెక్కుతోంది. చంద్రమోహన్‌, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్‌.

    English summary
    Allari Naresh has come up with a spoof called Sudigaadu. Sudigaadu also has a spoof on Eega too. Eega begins with the voice over of Rajamouli and his daughter's conversation. Rajamouli's daughter asks him to narrate a story, while his wife keeps telling them to sleep, and the director agrees to tell the story of Eega and bad boy Sudeep.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X