‘సుడిగాడు’ టాక్ ఏంటి?
హైదరాబాద్: కామెడీ స్టార్ అల్లరి నరేష్ మరియు మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ 'సుడిగాడు'. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అరుంధతి మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ డి. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు ముందే భారీ పబ్లిసిటీ సొంతం చేసుకున్న ఈచిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అల్లరి నరేష్ తన సినిమాల్లో అడపా దడపా పెద్ద హీరోలను అనుకరించినా పూర్తి పేరడీ సినిమా చెయ్యలేదు. ఆ లోటుని ఈ చిత్రంతో భర్తీ చేసారు, ఈ చిత్రంలో సుమారు టాలీవుడ్ టాప్ 100 సినిమాల్లోని సన్నివేషాలను తీసుకొని పేరడీ చేసారు. సినిమా టాక్ విషయానికొస్తే ఈచిత్రం ఎబో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో కామెడీ డైలాగులు బాగానే పేలినా...కొన్ని చోట్ల మరీ ఓవర్ అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని సూపర్ హిట్ సినిమాల్లోని సన్నివేశాలను ప్రేక్షకులు నవ్వుకునేలా పేరడీ చేయడం ఈ చిత్రంలో హైలైట్.
ముఖ్యంగా టాలీవుడ్ తొడగొట్టుడు హీరోల్లో ఒకరైన బాలయ్య గుర్తొచ్చేలా తీసిన తొగొట్టుడు కామెడీ సీన్, టీవీ యాంకర్ ఓంకార్ మీద తీసిన పేరడీ లాంటివి బాగున్నాయి. చాలా చోట్ల నవ్వించినా...కొన్ని చోట్ల బోరింగ్ ఫీలయ్యే సీన్లు కూడా ఉన్నాయి. క్లైమాక్స్ ఇంట్రస్టింగా లేదు.
కమెడియన్లు జయప్రకాశ్ రెడ్డి, సాయాజీ షిండే, కృష్ణ భగవాన్ మరియు ఎం.ఎస్ నారాయణ నటన చాలా బాగుంది మరియు వారి గెటప్పులతో కూడా ప్రేక్షకులను బాగా నవ్వించారు. జెఫ్ఫా రెడ్డి పాత్రలో బ్రహ్మానందం బాగా నవ్వించారు. హేమ మరియు కోవై సరళ తమ పరిధి మేర నటించాగా శ్రీనివాస రెడ్డి ఖలేజాలోని సిద్ద పాత్రకి పేరడీగా రూపొందించిన పాత్రలో బాగా నవ్వించారు. ఫిష్ వెంకట్ మరియు రఘుబాబు ఒక మాదిరిగా నవ్వించారు.
మొత్తానికి ఈచిత్రానికి వెళ్లిన వారికి గ్రేట్ కామెడీ ఫిల్మ్ చూసిన అనుభూతి కలగక పోయినా.... నవ్వుతూ బయటకు రావడం మాత్రం ఖాయం.


Click it and Unblock the Notifications











