రవితేజను బీట్ చేసిన అల్లరి నరేష్
హైదరాబాద్: సుడిగాడు చిత్రంలో సడెన్ స్టార్ గా మారిన అల్లరి నరేష్ ఓవర్సీస్ లో బిజినెస్ అదరగొడుతున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోలపై స్ఫూప్స్ చేస్తూ రూపొందించిన ఈ చిత్రం అంచనాలకు మించిన రెస్పాన్స్ తో దూసుకెలుతోంది. తాజాగా 'సుడిగాడు' చిత్రం రవితేజ నటించిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రాన్ని బీట్ చేసింది.
యూఎస్ బాక్సాఫీస్ రిపోర్టు ప్రకారం తొలి నాలుగు రోజుల్లో సుడిగాడు చిత్రం రూ. 69.83 లక్షల(125,484 USD) వసూళ్లు సాధించింది. ఇదివరకెన్నడూ ఈ రేంజిలో అల్లరి నరేష్ చిత్రం ఇక్కడ వసూళ్లు సాధించలేదు. ఇక 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం పది రోజుల్లో కేవలం రూ. 10.20 లక్షలు (18,321 USD) మాత్రమే కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో చంద్రమోహన్, అలీ, బ్రహ్మానందం, షాయాజీషిండే, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, వేణుమాధవ్, జీవా, కృష్ణ్భగవాన్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సంగీతం: శ్రీవసంత్, పాటలు: సిరివెనె్నల, చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, కెమెరా: విజయ్ ఉలగనాథ్, ఎడిటింగ్: గౌతంరాజ్, నిర్మాత: డి.చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.


Click it and Unblock the Notifications











