‘సుడిగాడు’ సెన్సార్ రిపోర్ట్

ఈ చిత్రంలో నరేష్ సరసన మోనాల్ గజ్జర్ హీరోయిన్‌గా చేస్తోంది. . ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రానికి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ముందే ఈచిత్రం నరేష్ గత చిత్రాల కంటే మంచి బిజినెస్ చేస్తోంది. ఓవర్సీస్‌లో రూ. 10 నుంచి 20 లక్షలకు మించని నరేష్ మార్కెట్ ఈచిత్రంతో దాదాపు రూ. 50 లక్షలకు చేరుమైంది.
పవన్ కళ్యాణ్, వెంకటేష్ వంటి స్టార్స్ ని డైరక్ట్ చేసిన బీమినేని తొలిసారిగా అల్లరి నరేష్ ని డైరక్ట్ చేసి బిజినెస్ కు హైప్ తెచ్చారు. చంద్రమోహన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్, ఛాయాగ్రహణం: విజయ్ ఉలగనాథ్, సంస్థ : అరుంధతి మూవీస్, నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











