పిచ్చెక్కిస్తున్న ‘సుడిగాడు’ తాజా పోస్టర్లు
హైదరాబాద్ : టాలీవుడ్ సడెన్ స్టార్ అల్లరి నరేష్ తన తాజా సినిమా 'సుడిగాడు' విడుదలకు ముందు నుంచే ట్రైలర్లతో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పబ్లిసిటీలో భాగంగా తాజాగా ఈచిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్స్ విడుదలయి పిచ్చెక్కిస్తున్నాయి. అల్లరి నరేష్‌కు ఆల్ ఆఫ్రికా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందని, తొలి సారిగా నైజీరియాలో అల్లరి నరేష్ చిత్రం విడుదలవుతుందంటూ పోస్టర్లు విడుదల చేశారు.
మరో పోస్టర్లో....ప్రపంచ వ్యాప్తంగా 'సుడిగాడు చిత్రం 1,79,890 థియేటర్లలో విడుదలవుతూ రికార్డు సృష్టించడమే కాకుండా, తొలిసారిగా చంద్రమండలంలో విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం అంటూ ప్రకటించారు. అంతటితో ఆగకుండా నీల్. లెగ్‌స్ట్రాంగ్, చంద్రమండలం అల్లరి నరేష్ ఫ్యాన్ అసోయేషన్ అంటూ నేమ్ తగిలించారు.
ఈ విధంగా సంచలనాలు రేపుతున్న సుడిగాడు ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్లను నరేష్ అనుకరిస్తు నటించే సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్‌గా ఉంటాయి. భారతీయుడు, అపరిచితుడు, గబ్బర్ సింగ్ వేషాలలో నరేష్ కనిపిస్తాడు.
సినిమాలోని ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్వించేలా రూపొందించారు. రచనావౌర్య ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా వుండనుంది. చంద్రమోహన్, అలీ, బ్రహ్మానందం, షాయాజీషిండే, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, వేణుమాధవ్, జీవా, కృష్ణ్భగవాన్, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్, పాటలు: సిరివెనె్నల, చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, కెమెరా: విజయ్ ఉలగనాథ్, ఎడిటింగ్: గౌతంరాజ్, నిర్మాత: డి.చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.


Click it and Unblock the Notifications











