twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓవర్సీస్‌‍లో అల్లరి నరేష్ సుడి తిరిగింది

    By Bojja Kumar
    |

    కామెడి చిత్రాల హీరో అల్లరి నరేష్ వరుస కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అయితే నరేష్ సినిమాలకు ఆదరణ బాగానే ఉన్నా...స్టార్ హీరోల రేంజి మాత్రం కాదు. అందుకే నరేష్‌కి చిన్న బడ్జెట్ చిత్రాల మార్కు దాట లేదు. ఓవర్సీస్‌(విదేశాల్లో) నరేష్ అభిమానులు ఉన్నప్పటికీ ఆయన సినిమాలు ఎక్కువ మంది ప్రేక్షకులు డీవీడీల్లో చూడటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఆయన సినిమాలకు ఓవర్సీస్ రైట్స్ రూ. 10 లక్షలకు మించదు.

    అయితే 'సుడిగాడు' సినిమాతో అల్లరి నరేష్ కు ఓవర్సీస్‌లో సుడి తిరిగింది. ఓవర్సీస్‌లో 'సుడిగాడు' చిత్రాన్ని వేద మూవీస్ సంస్థ దక్కించుకుంది. ఈచిత్రానికి ఓవర్సీస్ రైట్స్ సాధారణ రేటు రూ. 10 లక్షల మార్కు దాటి దాదాపు 35 నుంచి 45 లక్షలు మధ్య చెల్లించి సదరు సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అంత డిమాండ్ ఉండటానికి కారణం స్టార్ హీరోలపై స్ప్కూప్ సీన్లు ఉండటమే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

    ఒక్క టిక్కెట్టుపై 100 సినిమాలు అనే ట్యాగ్ లైన్ పై రూపొందుతున్న ఈచిత్రాన్ని భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేస్తుండగా అరుంధతి మూవీస్ బేనర్ పై చక్రధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ సరసన మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో నరేష్ తండ్రి, కొడుకులుగా డబుల్ రోల్ చేస్తున్నాడు.

    బ్రహ్మానందం, ఆలి, ఎంఎస్ నారాయణ, చలపతిరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, పోసాని కృష్ణ మురళి, ఎల్ బి శ్రీరామ్, కొండవలస, షాయాజీ షిండే, కృష్ణ భగవాన్, వేణుమాధవ్, జీవా తదితరులు నటిస్తున్న ఈచిత్రం పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా రూపొందించారు.

    English summary
    Sudigadu (tag line ‘Oka ticket tho 100 cinemalu’) is an upcoming Telugu comedy film directed by Bheemineni Srinivasa Rao and produced by Chandrasekhar D Reddy under Arundhati Movies. Sudigadu overseas rights bagged by Vedha Movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X