Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆయన్ని మిస్ అవ్వకుండా గుర్తు చేస్తూనే ఉన్నారు.. వారిపై సుడిగాలి సుధీర్ ప్రశంసలు
సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్కు కొదవే ఉండదు. అక్కడ ఎంత పాజిటివిటీ ఉంటుందో.. అంతే స్థాయిలో నెగెటివిటీ ఉంటుంది. అయితే ప్రతిభను చూపించుకునే వారికి మాత్రం సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం బాగానే ఉపయోగపడుతోంది. సోషల్ మీడియాలో మీమ్స్,కు ఇప్పుడున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా కూడా చిన్న మీమ్ రూపంలో చెబితే ఎంతో ఈజీగా ఎక్కేస్తుంటుంది. అయితే ఈ మీమ్స్, వాటిని తయారు చేసే మీమర్స్‌పై సుధీర్ తాజాగా కామెంట్ చేశాడు.
Recommended Video
మీమ్స్ లేకుండా..
ప్రస్తుత జీవిత ప్రయాణంలో మీమ్ చూడకుండా ఒక్క రోజు కూడా గడవదు. ప్రతీ ఒక్కరూ రోజులో ఏదో ఒక సమయంలో కనీస ఒక్క మీమ్ అయినా చూస్తుంటారు. కాసేపు హాయిగా నవ్వుకుని ఉంటారు. అలా మీమ్స్ క్రియేటర్స్‌కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రివ్యూలు, టాక్‌లు ఇలా అన్నీ కూడా మీమ్స్ రూపంలోనే వస్తున్నాయి.
బ్రహ్మానందం స్పెషల్..
ఇక ఎన్ని మీమ్స్ వచ్చినా కూడా అందులో కచ్చితంగా బ్రహ్మానందం ఉండాల్సిందే. మీమ్స్, జిఫ్ ఫైల్స్‌కు బ్రహ్మానందం కింగ్ లాంటి వాడు. ఎలాంటి మీమ్ అయినా సరే బ్రహ్మానందం హావాభావాలకు సరిగ్గా సెట్ అవుతుంది. తెలుగులో వచ్చే మీమ్స్ అన్నింటిలో బ్రహ్మానందం కచ్చితంగా ఉంటాడు.
సుధీర్ కామెంట్స్..
అలా మనకు బ్రహ్మానందంను రోజూ రకరకాలు పరిచయం చేస్తూ.. మీమ్స్ క్రియేట్ చేస్తూ నవ్విస్తోన్న మీమర్స్‌పై గురించి సుధీర్ కామెంట్ చేశాడు. అయితే ప్రస్తుతం ఏ సందర్భంగా అలా కామెంట్ చేశాడో క్లియర్‌గా చెప్పలేదు. కానీ సుధీర్ చేసిన పోస్ట్ మాత్రం బాగానే వైరల్ అవుతోంది.
సుధీర్ అలా..
మీమర్స్ గురించి సుధీర్ మాట్లాడుతూ.. మీ క్రియేటివిటీతో అందరినీ నవ్విస్తున్నందుకు మీమర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను.. అంతే కాకుండా కామెడీ కింగ్ బ్రహ్మానందం గారిని మనం మిస్ కాకుండా ప్రతీ రోజూ చూపిస్తున్నందుకు కూడా థ్యాంక్స్.. అందరినీ నవ్వించేందుకు మీరు పడుతున్న శ్రమకు ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.