ఆ ఇద్దరంటే పిచ్చి.. చచ్చేవరకు అలానే.. సుడిగాలి సుధీర్ ఎమోషనల్
జబర్దస్త్ టెలివిజన్ షోతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న సుధీర్ అలియాస్ సుడిగాలి సుధీర్.. ఇక వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ విడుదలకు సిద్ధమైంది. ఇటీవల జరిగిన ఓ వేడుకలో సుడిగాలి సుధీర్ ఎమోషనల్ అయ్యారు. హీరోగా నటించినా కమెడియన్‌గానే ఉండటం ఇష్టమని చెప్పారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ..

నేను ఎప్పటికీ హీరో అని
నేను ఎప్పటికీ హీరో అని ఫీల్ కాను. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాకు కథే హీరో. ఈ మూవీలో ఎవర్ని పెట్టినా బాగా ఆడుతుంది. మంచి కథతో తెరకెక్కింది. ఫీల్‌గుడ్ హాస్యంతో అందర్ని నవ్వించేలా ఉంటుంది. నేను హీరోగా నటించినా.. నేను చచ్చిపోయేంత వరకు నవ్విస్తూనే ఉంటాను. అలానే మీ మనసులో స్థానం సంపాదించుకొంటాను అని సుడిగాలి సుధీర్ అన్నారు.

నా జీవితంలో బాగా నచ్చిన వ్యక్తులు
నా జీవితంలో బాగా నచ్చిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఆ ఇద్దరంటే పిచ్చి. వారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మరొకరు సూపర్ స్టార్ రజనీకాంత్. నేను సినిమాల్లోకి రావాలనే కోరికకు చిరంజీవి స్ఫూర్తి. ఆయనను చూసే సినిమాల్లో నటించాలని అనుకొన్నారు. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలో నేను పవన్ కల్యాణ్ అభిమానిగా నటించాను. దాంతో నాకు ఉన్న ఓ కోరిక కూడా తీరిపోయింది అని సుధీర్ పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్ సుధీర్ చిత్రంలో
సాఫ్ట్‌వేర్ సుధీర్ చిత్రంలో సినిమాల్లో పవన్ కల్యాణ్, రజనీకాంత్‌ను ఇమిటేట్ చేశాను. నేను వద్దని చెప్పినా నిర్మాత, దర్శకులు నాతో పట్టుబట్టి చేయించారు. నేను అలా ఇమిటేట్ చేయడం నాకు భయమేసింది. ఆ తర్వాత నేను ధైర్యం తెచ్చుకొని వారిని ఇమిటేట్ చేశాను. అందరికీ బాగా నచ్చుతుంది అని సుడిగాలి సుధీర్ అన్నారు.

సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా గురించి
సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా అన్ని అంశాలతో అన్ని వర్గాలకు నచ్చే విధంగా ఉంటుంది. ఈ సినిమాను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని అనుకొంటున్నాం. మా సినిమా అందరికీ చేరువ అవుతుంది. పెద్ద సినిమాలు అంటే ప్రమోట్ చేయకపోయినా వైరల్ అవుతాయి. మా సినిమాను మీరు మరింత ప్రమోషన్ చేసి ప్రేక్షకుల వద్దకు తీసుకుపోవాలని కోరుకొంటున్నాను. ఇప్పటికే ఈ సినిమాను ప్రేక్షకుల్లో క్రేజ్‌ను తీసుకొచ్చిన మీడియాకు మేము రుణపడి ఉంటాం అని సుధీర్ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











