తాతల కాలం నుంచి అదే నడుస్తోంది.. హోల్డ్‌లో పెట్టా.. పెళ్లిపై సుడిగాలి సుధీర్ క్లారిటీ

సుడిగాలి సుధీర్.. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన పర్సనాలిటీ ఇది. బుల్లితెరపై నవ్వుల హరివిల్లుకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా వ్యవహరించే ఈ సుడిగాడు వెండితెరపై కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. ఇక సుధీర్ పెళ్లి గురించి వస్తున్న రూమర్స్, అమ్మాయిలను చూస్తే సుధీర్ ఫీలింగ్స్ ఈ విషయాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలా!. అయితే తాజాగా ఈ దీపావళి సందర్బంగా సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ఓ క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాలేంటో చూద్దామా..

 దివాళీ స్పెషల్ షో.. జబర్దస్త్ వీరులు

దివాళీ స్పెషల్ షో.. జబర్దస్త్ వీరులు

ఈ దీపావళి సందర్బంగా జబర్దస్త్ కమెడియన్లు రామ్ ప్రసాద్, గెటప్ శీను, సుడిగాలి సుధీర్ ఓ ఛానెల్ లో జరిగిన చిట్ చాట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఈ ముగ్గురి గురించిన పెళ్లి ముచ్చట్లే హైలైట్ అయ్యాయి. రామ్ ప్రసాద్, గెటప్ శీను తమ పెళ్లి అయిపోయిందని ఆ సంగతులు చెప్పగా, సుడిగాలి సుధీర్ కూడా పెళ్లి గురించి స్పందించాడు.

ఇంట్లో వాళ్ళ ఫోర్స్ ఉంది.. హింట్ ఇచ్చేశాడు

ఇంట్లో వాళ్ళ ఫోర్స్ ఉంది.. హింట్ ఇచ్చేశాడు

తొందరగా పెళ్లి చేసుకోమని తనను ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని చెప్పాడు సుడిగాలి సుధీర్. కానీ నేను మాత్రం ఇంకాస్త టైమ్ తీసుకుందామని అనుకుంటున్నానని సుధీర్ అన్నాడు. తనకు ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నానే ఫీలింగ్ ఉందని, అందుకే కొన్ని రోజుల పాటు ఆగుతానని ఆయన పేర్కొన్నాడు. తన పెళ్లిపై వస్తున్న రూమర్స్‌ని లైట్ తీసుకుంటున్నట్లుగా హింట్ ఇచ్చాడు సుధీర్.

జరిగినా జరగొచ్చు అనేసి షాకిచ్చాడు

జరిగినా జరగొచ్చు అనేసి షాకిచ్చాడు

ఇప్పటికే పలు షోస్ లో సుడిగాలి సుధీర్ చాలా సార్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయం ప్రస్తావిస్తూ మీ ఫీలింగ్స్ ఏంటి? ఏదో ఒక రోజు లైవ్ లోనే మీ నిజమైన పెళ్లి జరుగుతుందేమో అని యాంకర్ అనడంతో.. స్పందించిన సుధీర్ ఏమో.. జరగొచ్చేమో అనడంతో అంతా షాకయ్యారు. ఈ లెక్కన సుధీర్ ఏదో ఒకరోజు లైవ్ లోనే పెద్ద బాంబ్ వేస్తాడేమో అని చెప్పుకుంటున్నారు జనం.

తాతల కాలం నుంచే అలా నడుస్తోంది.. హోల్డ్‌లో పెట్టా

తాతల కాలం నుంచే అలా నడుస్తోంది.. హోల్డ్‌లో పెట్టా

ఇక మీరు చేసుకోబోయేది లవ్ మ్యారేజా? పెద్దలు కుదిర్చిన మ్యారేజా? అనే ప్రశ్నపై బదులిచ్చిన సుడిగాడు.. తాతల కాలం నుంచే తమ ఫ్యామిలీలో కట్నాలు తీసుకోవడం అలవాటు లేదని, తన తమ్ముడిది కూడా లవ్ మ్యారేజ్ అని అన్నాడు. ప్రస్తుతానికైతే నా పెళ్లి విషయాన్ని నేనే హోల్డ్‌లో పెట్టానని అన్నాడు సుధీర్.

రష్మీ- సుధీర్ సంగతులు

రష్మీ- సుధీర్ సంగతులు

ఇక రష్మీ- సుధీర్ సంగతులంటారా? ఈ ఇద్దరికీ ఎప్పుడో పెళ్ళై పోయింది. అందుకే ఈ ఇద్దరి పేర్లు వినబడితే చాలు అదో క్రేజీ జనాలకు. కాకపోతే అది నిజమైన పెళ్లి కాకపోవడంతో నిజంగా చేసుకుంటారా అనే క్యూరియాసిటీ కొంత నెలకొంది. ఇప్పుడు సుధీర్ కూడా ఏమో! జరగొచ్చేమో.. అనేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

వెండితెర పైకి సుడిగాడు.. తొలి సినిమా..

వెండితెర పైకి సుడిగాడు.. తొలి సినిమా..

శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంతో సుడిగాలి సుధీర్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ సరసన 'రాజు గారి గది' ఫేమ్‌ ధన్యా బాలకృష్ణను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X