చిరంజీవిని అలా చూడటంతో కన్నీళ్లు ఆగలేదు.. సుడిగాలి సుధీర్ కామెంట్స్

బుల్లితెర కింగ్ అనిపించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్. ఫన్నీ స్కిట్స్, యాంకరింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తున్న ఈ సుడిగాడు.. ఇటీవలే చిరంజీవి క్యారెక్టర్ గురించిన కొన్ని విషయాలు బయటపెట్టాడు. ఆ వివరాలు చూద్దామా..

సుధీర్ హీరోగా తెరంగేట్రం.. తొలి సినిమా

సుధీర్ హీరోగా తెరంగేట్రం.. తొలి సినిమా

శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'సాఫ్ట్‌వేర్ సుధీర్'తో సుడిగాలి సుధీర్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ సరసన 'రాజు గారి గది' ఫేమ్‌ ధన్యా బాలకృష్ణను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

చిరంజీవితో ఎదురైన ఓ సంఘటన

చిరంజీవితో ఎదురైన ఓ సంఘటన

ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న 'సాఫ్ట్‌వేర్ సుధీర్' సినిమా అతిత్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సుడిగాలి సుధీర్.. మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎదురైన ఓ సంఘటన గురించి వివరారించాడు. ఈ మేరకు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పాడు సుధీర్.

 తమ్ముడిని వెంటపెట్టుకొని చిరంజీవి ఇంటికెళ్లా..

తమ్ముడిని వెంటపెట్టుకొని చిరంజీవి ఇంటికెళ్లా..

తన జీవితంలో తనకు మెగాస్టార్ చిరంజీవితో ఓ మధుర జ్ఞాపకం ఉందని చెబుతూ దానిని గుర్తు చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. తాను కొత్తగా ఇల్లు కొనుక్కొని గృహప్రవేశానికి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళ్లానని, ఆ సమయంలో తనవెంట తన తమ్ముడు కూడా ఉన్నాడని సుధీర్ తెలిపారు.

మొహమాట పడ్డా.. చిరంజీవి స్వయంగా

మొహమాట పడ్డా.. చిరంజీవి స్వయంగా

చిరంజీవి గారు అంత పెద్ద స్టార్ అయినప్పటికీ మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారని సుధీర్ చెప్పుకొచ్చారు. తమకు ట్రేలో పాలు తెప్పిస్తే తాగడానికి కొంత మొహమాట పడ్డానని.. కానీ ఆయనే స్వయంగా పాలు కలిపి ఇవ్వటంతో జన్మ ధన్యమైపోయిందని సుధీర్ చెప్పాడు. ఇక ఆ తర్వాత చిరంజీవి గారు కొత్తబట్టలు గిఫ్ట్ తెప్పించి ఇచ్చారని తెలిపాడు.

చిన్నప్పటినుంచి అభిమానించే హీరో చిరంజీవి ఇలా..

చిన్నప్పటినుంచి అభిమానించే హీరో చిరంజీవి ఇలా..

తాను చిన్నప్పటినుంచి అభిమానించే హీరో చిరంజీవి.. ఇలా తనను అంతటి ప్రేమతో చూడడంతో కన్నీళ్లు ఆగలేదని సుధీర్ అన్నాడు. చిరంజీవి గారి ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఆయన చూపించిన ఆప్యాయత గురించి అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెబుతూ గట్టిగా ఏడ్చేశానని సుధీర్ పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X