ప్రదీప్ ఆరోగ్యంపై సుధీర్ షాకింగ్ కామెంట్స్: అతడి నవ్వు వెనుక అంతటి బాధ ఉందంటూ ఎమోషనల్!

తనదైన శైలి టాలెంట్‌తో యాంకరింగ్‌కు సరికొత్త అర్థం చెబుతూ.. బుల్లితెరపై టాప్ యాంకర్‌గా వెలుగొందుతోన్నాడు యంగ్ సెన్సేషన్ ప్రదీప్ మాచిరాజు. దాదాపు పదేళ్లుగా టెలివిజన్ రంగంలో తన హవాను చూపిస్తున్న అతడు.. ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ ఆరోగ్యంపై జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడి బాధను వివరిస్తూ ఎమోషనల్ అయ్యాడు. అసలేం జరిగింది?

ప్రదీప్ కెరీర్ అలా మొదలై.. ఇలా సెట్టైంది

ప్రదీప్ కెరీర్ అలా మొదలై.. ఇలా సెట్టైంది

ప్రముఖ ఎఫ్‌ఎస్ సంస్థలో రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించాడు ప్రదీప్. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారం అయిన ఓ గేమ్ షో ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'గడసరి అత్త సొగసరి కోడలు' అనే షోతో బ్రేక్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోని అతడు.. వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. దీంతో టాప్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు.

షోలతో పాటు ఆ హీరోల సినిమాల్లో ఛాన్స్

షోలతో పాటు ఆ హీరోల సినిమాల్లో ఛాన్స్

తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో సత్తా చాటుతోన్న ప్రదీప్.. ఎన్నో షోలలో చేస్తూ తన హవాను చూపిస్తున్నాడు. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ 'జులాయి', నాగ చైతన్య '100% లవ్', ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' వంటి చిత్రాలు అతడికి పేరు తెచ్చాయి.

హీరోగా ఎంట్రీ.. విడుదలకు ముందే రికార్డ్

హీరోగా ఎంట్రీ.. విడుదలకు ముందే రికార్డ్

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు యాంకర్ ప్రదీప్. మున్నా అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. 'నీలి నీలి ఆకాశం' అనే పాటతో రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేసిన ప్రదీప్.. సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక, ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

దెబ్బకు రెండు సంస్థలూ భాగమయ్యాయి

దెబ్బకు రెండు సంస్థలూ భాగమయ్యాయి

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ, కరోనా సహా ఎన్నో ఆటంకాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితులు లేవన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో బడా నిర్మాణ సంస్థలు గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ దీన్ని విడుదల చేసేందుకు ముందుకొచ్చాయి. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి.

ప్రదీప్ ఆరోగ్యంపై సుధీర్ షాకింగ్ కామెంట్స్

ప్రదీప్ ఆరోగ్యంపై సుధీర్ షాకింగ్ కామెంట్స్

యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తోన్న మొదటి చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి ఎంతో మంది గెస్టులు వచ్చారు. ఈ సందర్భంగా జబర్ధస్త్ ఫేం సుడిగాలి సుధీర్.. ప్రదీప్ ఆరోగ్యంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అతడి నవ్వు వెనుక అంతటి బాధ ఉందంటూ

అతడి నవ్వు వెనుక అంతటి బాధ ఉందంటూ

ఈ ఈవెంట్‌లో సుధీర్ మాట్లాడుతూ.. 'ప్రదీప్ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. దీని కోసమే కాదు.. షోలలోనూ మిమ్మల్ని నవ్వించేందుకు తన బాధను సైతం పక్కన పెట్టేస్తాడు. తనకు ఆరోగ్య సమస్య ఉంది. దీంతో సరిగా కూర్చోలేడు. దీనివల్ల అతడు చేసే ప్రతి షోలోనూ నిలబడే ఉంటాడు. అతడి పెదాలపై కనిపించే నవ్వు వెనుక ఎంతో బాధ ఉంది' అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet క్రేజ్ నిలుపుకుంటాడా? బిగ్ బాస్ వల్ల ఆ విజేతలకు ఒరిగింది ఏమిటి ?
నా సోదరుడు.. ఈ విషయం పది మందికి చెప్పండి

నా సోదరుడు.. ఈ విషయం పది మందికి చెప్పండి


సినిమా గురించి మాట్లాడుతూ.. 'ప్రదీప్ నాకు సోదరుడితో సమానం. నా సినిమా గురించి కూడా ఎప్పుడూ దేవుడికి దండం పెట్టలేదు. కానీ, ఇప్పుడు ఈ మూవీ హిట్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా. అతడు అంతలా కష్ట పడతాడు. పాటను ఎంత హిట్ చేశారో.. సినిమానూ అలానే చేయండి. బాగుందని పది మందికి చెప్పి సినిమా చూపించండి' అంటూ కోరాడు సుధీర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X