రష్మిని కాదని ఆ అమ్మాయితో సుడిగాలి సుధీర్ ఎంగేజ్మెంట్
జబర్దస్త్ షో ద్వారా అనేకమంది కమెడియన్లుగా మెరిశారు. కానీ వారిలో స్టార్ క్రేజ్ దక్కించుకుంది మాత్రం కొందరే. ఆ కొందరిలో ముందు వరుసలో ఉంటాడు సుడిగాలి సుధీర్. నిజానికి సుడిగాలి అనేది అతనికి ఇచ్చిన టీం పేరు. ఆ తర్వాత కాలంలో అదే అతని పేరుగా ఫిక్స్ అయిపోయింది. ఎప్పటికప్పుడు రష్మితో ప్రేమలో ఉన్నట్టు కలరింగ్ ఇస్తూ ట్రెండింగ్ లో ఉంటే... ఈ సుధీర్ ఇప్పుడు పెళ్లి పీటలేకపోతున్నాడు అనే వార్త టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...
జబర్దస్త్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్... ఓవర్ రైట్ స్టార్ అయ్యాడని చెప్పలేం కానీ బుల్లితెర మీద సూపర్ క్రేజ్ దక్కించుకొని బుల్లితెర సూపర్ స్టార్ అయిపోయాడు. ముందు మెజీషియన్ గా కెరియర్ ప్రారంభించిన సుధీర్ ఆ తర్వాత జబర్దస్త్ లో కనిపించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. కమెడియన్ గా మారి మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఈటీవీ షో లలో యాంకర్ గా కూడా మెరిసి సత్తా చాటడమే కాదు... విష్ణు ప్రియతో కలిసి ఆయన చేసిన పోవే పోరా షో అప్పట్లో మంచి టీఆర్పీలు కూడా సాధించింది.

ఇక మల్లెమాల వారి పుణ్యమా అని రష్మీతో లవ్ ట్రాక్ నడుపుతున్నట్టు కనిపించే ఈ సుధీర్ అసలు రష్మికి తనకు మధ్య ఎలాంటి పర్సనల్ రిలేషన్ లేదని కేవలం అంత షో వరకు మాత్రమే అని ఎన్నోసార్లు ప్రచారం జరిగినప్పుడు క్లారిటీ ఇచ్చిన ఈ ప్రచారం మాత్రం ఎప్పటికప్పుడు తెరమీదకి వస్తూనే ఉంటుంది.ఇక ఆ మధ్య వరుసకు మరదలు అయ్యే ఒక అమ్మాయిని సుదీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని కూడా ప్రచారం జరిగింది. ఆ విషయం మీద క్లారిటీ లేదు . కానీ ఇప్పుడు తాజాగా దానికి ఊతమిచ్చే విధంగా మరో ప్రచారం మొదలైంది.

అదేమిటంటే ఆ మరదలు వరుసయ్య అమ్మాయితోనే సుధీర్ నిశ్చితార్థం జరుపుకున్నాడనే వార్త ఇప్పుడు టోటల్ గా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ వేడుక కేవలం దగ్గర బంధువులు సమక్షంలోనే జరిగిందని ఎలాంటి టీవీ నటులు సినీనటులను ఆహ్వానించలేదని తెలుస్తోంది. అయితే సుధీర్ రష్మీ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఆశించిన వారందరూ ఇప్పుడు బాధపడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నారు.

అయితే ఈ ప్రచారం ఇప్పటినుంచి కాదు గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ఇప్పటివరకు సుధీర్ స్పందించకపోవడంతో నిజంగానే సుధీర్ కి ఆయన మరదలుతో నిశ్చితార్థం జరిగిపోయింది ఏమో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఒకపక్క కమెడియన్ గా కొనసాగుతూనే మరోపక్క హీరోగా కూడా మారిన సుడిగాలి సుదీర్ ఇప్పటికే పలు సినిమాలతో అలరించాడు. ఇక త్వరలో కాలింగ్ సహస్ర అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ పెళ్లి వార్తను సుధీర్ ఖండిస్తే తప్ప ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











