అందరూ నన్ను హీరో అంటున్నారు.. ఎగ్జైటింగ్‌గా ఉంది కానీ: జబర్దస్త్ ఫేం సుధీర్ కామెంట్

బుల్లితెరపై తమ మార్క్ చూపిన నటీ నటులంతా వెండితెర బాట పెట్టేస్తున్నారు. చైనా తెరపై వీళ్ళ హంగామా చూసి ఫిదా అవుతున్న దర్శక నిర్మాతలు వీరికి అవకాశం ఇచ్చేదుకు ముందుకొస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీ ముఖి, చమ్మక్ చంద్ర.. ఈ లెక్కన చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే ఉంటుంది. అయితే ఈ లిస్ట్ లో తాజాగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ కూడా ఎంటర్ అవుతున్నాడు. సుధీర్ హీరోగా కొత్త సినిమా రాబోతోంది. ఆ వివరాలు చూస్తే..

శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంతో సుడిగాలి సుధీర్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ సరసన 'రాజు గారి గది' ఫేమ్‌ ధన్యా బాలకృష్ణను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సాఫ్ట్ వేర్ సుధీర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల అనే నూతన దర్శకుడు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రాన్ని జులై చివరి వారంలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Sudigali Sudheer enter into movies

ఈ మేరకు తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ.. ''అందరూ కలిసి నన్ను హీరో చేస్తున్నారు. కానీ ఈ సినిమాకు కథే హీరో. కథ వినగానే ఎంతో ఎగ్జైట్ అయ్యాను. వెంటనే ఓకే చెప్పేశాను. ఇప్పటి వరకూ ఆడియన్స్‌ నన్ను తమ పక్కింటి కుర్రాడిగానే పరిగణిస్తారు. ఇంత తక్కువ టైంలోనే వారి ఆదరాభిమానాలు పొందడం నిజంగా నా అదృష్టం. సాఫ్ట్ వేర్ సుధీర్ అనే నా తొలి సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా వకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు'' అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X