Gaalodu Twitter Review: గాలోడుకు అలాంటి టాక్.. ప్లస్ మైనస్‌లు ఇవే.. ఇంతకీ సుధీర్ హిట్ కొట్టాడా అంటే!

ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లు వచ్చారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే తమ ప్రతిభను నిరూపించుకుని భారీ స్థాయిలో పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. జబర్ధస్త్ షోతో వచ్చిన అతడు.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగాడు. దీంతో సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సుధీర్ 'గాలోడు' చిత్రంతో హీరోగా వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? ఓవరాల్ రిపోర్ట్ ఏంటి? చూద్దాం పదండి!

గాలోడుగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్

గాలోడుగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్

బుల్లితెర ఆల్‌రౌండర్‌గా వెలుగొందుతోన్న సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సినిమానే 'గాలోడు'. ఇందులో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. భీమ్స్ దీనికి సంగీతం అందించారు. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

అలాంటి జోనర్... అంచనాలతో

అలాంటి జోనర్... అంచనాలతో

'గాలోడు' సినిమా ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో సుడిగాలి సుధీర్ అల్లరి పనులు చేస్తూ తిరిగే గాలోడుగా నటిస్తున్నాడు. అలాంటి ఓ కుర్రాడు అమ్మాయి ప్రేమలో పడడం.. ఆ తర్వాత విలన్స్ ఎంట్రీతో జైలుకు వెళ్లడం.. వంటి అంశాలతో ఇది తెరకెక్కింది. పాత కథలానే కనిపిస్తున్నా.. ఈ మూవీ ట్రీట్‌మెంట్ చాలా కొత్తగా ఉంటుందట.

ట్విట్టర్‌లో గాలోడుకు టాక్ ఇలా

ట్విట్టర్‌లో గాలోడుకు టాక్ ఇలా

సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' మూవీ ఎన్నో అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో ఈ సినిమా షోలు పడిపోయాయి. దీంతో ట్విట్టర్ వేదికగా చాలా మంది ఈ సినిమాపై తమ అభిప్రాయాలు చెప్తున్నారు. అయితే, ఈ చిత్రం విషయంలో కొందరు బాగుందని అంటుంటే.. మరికొందరు ఏవరేజ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

'గాలోడు' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం, ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లేందుకు కొంత టైమ్ తీసుకున్నారట. అయితే, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయేలా ఉంటుందట. కానీ, సెకెండాఫ్ మాత్రం ఫుల్ ఆఫ్ మాస్ ట్రీట్, యాక్షన్ సీక్వెన్స్‌తో ఉంటుందని తెలిసింది. కానీ, క్లైమాక్స్ మాత్రం కొత్తగా లేకపోవడంతో తేలిపోయినట్లు అనిపిస్తుందని టాక్జ

సినిమాలో ప్లస్‌.. మైనస్‌లు ఇలా

సినిమాలో ప్లస్‌.. మైనస్‌లు ఇలా


'గాలోడు' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో సుడిగాలి సుధీర్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్, కామెడీ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అలాగే, దర్శకుడు ఎంచుకున్న కథ కొత్తగా లేకపోవడంతో పాటు నెమ్మదించిన స్క్రీన్‌ప్లే, లీడ్ పెయిర్ మధ్య లవ్ ట్రాక్, లాజిక్ లేని సన్నివేశాలు ఈ చిత్రానికి మైనస్‌గా మారాయని చెబుతున్నారు.

మొత్తంగా గాలోడు ఎలా ఉంది?

మొత్తంగా గాలోడు ఎలా ఉంది?

ట్విట్టర్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. సుధీర్ నటించిన 'గాలోడు' మూవీ ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే వ్యక్తి సమస్యల్లో పడి సిటీకి రావడం.. అక్కడ మళ్లీ సమస్యలను ఎదుర్కోవడం అనే అంశాలతో తెరకెక్కింది. ఇది మొత్తంగా పాత కథే అయినా మాస్ ట్రీట్‌మెంట్ కొత్తగా ఉండేలా చేశారట. ఇక, సుధీర్ కోసం అయితే ఈ సినిమా చూడొచ్చని అంటున్నారు.

మరి సుధీర్ హిట్ కొట్టాడా అంటే

మరి సుధీర్ హిట్ కొట్టాడా అంటే

ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' మూవీకి ఏబో ఏవరేజ్ టాక్ వచ్చినట్లు తెలిసింది. అయితే, అతడిని ఇష్టపడే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మెచ్చే అంశాలు ఇందులో ఉన్నాయట. కాబట్టి వాళ్లను థియేటర్లకు రప్పించుకోగలిగే టాక్ వస్తే మాత్రం సుడిగాలి సుధీర్‌కు కలెక్షన్లు వచ్చి సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.

బుకింగ్స్ సూపర్.. ఫ్యాన్స్ కోరిక

బుకింగ్స్ సూపర్.. ఫ్యాన్స్ కోరిక

ఇక, సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' మూవీకి అడ్వాన్స్ బుకింగ్ బాగున్నాయని తెలిసింది. ఈరోజు ఉదయం 6 గంటల వరకూ ఈ మూవీ బుకింగ్స్ ద్వారా రూ. 30 - 40 లక్షలు వసూలు చేసిందని సమాచారం. ఇక, ఈ సినిమాలో కొత్తదనం ఉండదని.. అయినా నీకు హిట్ అందించేందుకు ప్రయత్నిస్తామని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. అలాగే, 'గాలోడు'ని ట్రెండ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X