For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దానికోసం హీరోయిన్లు వద్దు ఆమెనే ముద్దు.. సుడిగాలి సుధీర్‌ షాకింగ్ కామెంట్స్.. రష్మీ రియాక్షన్

  |

  బుల్లితెర జబర్దస్త్ జోడీ సుడిగాలి సుధీర్‌- రష్మీ గౌతమ్. పబ్లిక్ ఈవెంట్ అయినా, ప్రైవేట్ ఈవెంట్ అయినా, ఎలాంటి షో అయినా రష్మీ గౌతమ్‌పై సుడిగాలి సుధీర్ వేసే పంచ్ డైలాగ్స్ బాగా పేలుతుంటాయి. అందుకే ఈ జోడీని సూపర్ పాపులారిటీతో పాటు పలు రూమర్స్ కూడా చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రోగ్రాంలో రష్మిని ఉద్దేస్తూ సుధీర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దామా..

  #CineBox : Ileana D'Cruz Missed Out 2 Golden Chances With Salman Khan In These Two Films !
  టీవీ షోలలో కూడా ఇదే పిలుపు

  టీవీ షోలలో కూడా ఇదే పిలుపు

  రష్మీ- సుధీర్‌ను యూట్యూబ్ జోడీగా అంటుంటారు. టీవీ షోలలో కూడా ఇదే తరహా పిలుపుతో ఏడిపిస్తుంటారు. దీనికి కారణం వీళ్లిద్దరిపై యూట్యూబ్‌ చానెళ్లలో వచ్చినన్ని రూమర్లు మరే ఇతర సెలెబ్రిటీలపై కూడా రాకపోవడమే. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలా ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.

  రష్మీ- సుధీర్ రిలేషన్.. హాట్ టాపిక్

  రష్మీ- సుధీర్ రిలేషన్.. హాట్ టాపిక్

  తమ రిలేషన్ గురించి వస్తున్న వార్తలన్నీ రూమర్సే అని ఇటు సుధీర్, అటు రష్మీ క్లారిటీ ఇచ్చినా కూడా ఆ వార్తలు ఆగటం లేదు. దీంతో రష్మీ- సుధీర్ రిలేషన్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. పైగా ఈ జోడీతో ప్రతీ పండుగకు ఓ స్పెషల్ కిక్ ఇస్తున్నారు టీవీ ప్రోగ్రామ్ నిర్వాహకులు. ఈ మేరకు రష్మీ- సుధీర్ రిలేషన్ తాలూకు రూమర్స్ మరింత పెరుగుతున్నాయి.

  ఆలీతో సరదాగా సుధీర్.. ఆశ్చర్య పరిచే స్టైల్

  ఆలీతో సరదాగా సుధీర్.. ఆశ్చర్య పరిచే స్టైల్

  తన మొదటి సినిమా 'సాఫ్ట్‌వేర్ సుధీర్' ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుడిగాలి సుధీర్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆలీతో సరదాగా టీవీ ప్రోగ్రాంలో సుధీర్ పాల్గొన్నాడు. అయితే ఈ ప్రోగ్రాంలో ఆలీ వేసిన ప్రశ్నకు సుధీర్ ఇచ్చిన సమాధానం, ఫేమస్ హీరోయిన్ల కంటే రష్మినే ఎక్కువ అన్నట్లుగా రియాక్ట్ అయిన తీరు ఆశ్చర్య పరుస్తోంది.

  ఓ వైపు దీపికా.. మరోవైపు ప్రియాంక.. మరి రష్మీ?

  ఓ వైపు దీపికా.. మరోవైపు ప్రియాంక.. మరి రష్మీ?

  ఒకవైపు దీపికా పదుకొనె, మరోవైపు ప్రియాంక చోప్రా ఉన్నారు. వారిద్దరిలో ఒకరినే హగ్ చేసుకునే అవకాశం వస్తే ఎవరిని హగ్ చేసుకుంటావని ఆలీ వేసిన ప్రశ్నకు సుడిగాలి సుధీర్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. వాళ్ళను పక్కనబెట్టి తాను రష్మీ ఎక్కడ అని అడుగుతానని అన్నాడు సుధీర్. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది.

  ఘాటుగా రష్మీ గౌతమ్

  ఘాటుగా రష్మీ గౌతమ్

  సిడిగాలి సుధీర్ మాటలు చూసిన రష్మీ ఈ సారి మాత్రం ఘాటుగానే రియాక్ట్ అయిందని తెలుస్తోంది. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం తన పేరును ఇలా వాడుకోవడం సబబు కాదంటూ తన సన్నిహితుల వద్ద వాపోతోందట రష్మీ.

  సీనియర్‌ నటి ఇంద్రజతో సాఫ్ట్‌వేర్ సుధీర్

  సీనియర్‌ నటి ఇంద్రజతో సాఫ్ట్‌వేర్ సుధీర్

  సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'సాఫ్ట్‌వేర్ సుధీర్' చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటించారు. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, డా. ఎన్‌. శివప్రసాద్‌, పృథ్వీ, సంజయ్‌ స్వరూప్‌, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  English summary
  Jabardasth feam Sudigali Sudheer enter into the cinema as hero. In this movie pramotions Sudigali Sudheer commented Rashmi Gautam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X