ఏడ్చిన సుధీర్.. ఒకప్పుడు తిండి పెట్టిన దాన్నే మళ్లీ పట్టించుకోలేదని!

జబర్దస్త్ అనే కామెడీ 'షో' ద్వారా వెలుగులోకి వచ్చిన సుడిగాలి సుధీర్.. అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. ఓవైపు కామెడీ స్కిట్స్ చేస్తూనే అడపాదడపా ఆడియో ఈవెంట్స్ లోనూ మెరిశాడు. ప్రస్తుతం పలు టీవి 'షో'లతో బిజీగా ఉన్నాడు.

మొన్నామధ్య దసరా మహోత్సవం పేరిట ఈటీవిలో నిర్వహించిన ఓ ప్రోగ్రామ్ లో అచ్చు ప్రొఫెషనల్ సింగర్ లాగే ఓ పాట కూడా పాడి మెప్పించాడు. ఇక తాజాగా ఏ విద్యతో అయితే తన కెరీర్ మొదలుపెట్టాడో.. అదే విద్యతో మరోసారి మెస్మరైజ్ చేశాడు.

Recommended Video

Anchor Rashmi Gautam Given Clarity On Sudheer Sudigali Link
 మ్యాజిక్:

మ్యాజిక్:

ఈటీవిలో ప్రసారమయ్యే 'ఢీ' షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్న సుధీర్.. తాజాగా తన మ్యాజిక్ ద్వారా అందరిని ఆకట్టుకున్నాడు. ఒకప్పుడు ప్రొఫెషనల్ మెజీషియన్ అయిన సుధీర్.. మరోసారి ఆ విద్యలో తన ప్రతిభను చాటుకున్నాడు.

సుధీర్ 'షో':

సుధీర్ 'షో':

మ్యాజిక్‌లో భాగంగా.. ఓ న్యూస్ పేపర్‌ను ముక్కలు, ముక్కలుగా చించేసిన సుధీర్.. తిరిగి తన మాయాజాలంతో చిరిగిన పేపర్ ను.. మళ్లీ ఉన్నది ఉన్నట్లు అతికించేశాడు. ఇక మరో మ్యాజిక్ ఐటెంలో.. ఖాళీ హ్యాండ్ కర్చీఫ్ లో పావురాన్ని చూపించి అందరిని ఆశ్చర్యపోయేలా చేశాడు.

భావోద్వేగంతో సుధీర్.

భావోద్వేగంతో సుధీర్.

మ్యాజిక్ పెర్ఫామెన్స్ తర్వాత సుధీర్ స్టేజీ పైనే భావోద్వేగానికి గురయ్యాడు. కమెడియన్‌గా మారిన తర్వాత మ్యాజిక్‌ను మళ్లీ పట్టించుకోలేదని చెప్పిన సుధీర్.. తనకు మొదట అన్నం పెట్టిన విద్య ఇదేనని ఎమోషనల్ అయ్యాడు.

మల్టీ టాలెంటెడ్:

మల్టీ టాలెంటెడ్:

కమెడియన్ గా రాణిస్తూనే.. అడపాదడపా తనలోని స్పెషల్ టాలెంట్ బయటపెట్టుకుంటున్నాడు సుధీర్. దసరా సందర్భంగా ఈటీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో.. 'అడిగా.. అడిగా..' అనే పాటతో చాలామందిని ఆశ్చర్యపోయేలా చేశాడు. ప్రొఫెషనల్ సింగర్‌లా అతను పాడిన విధానం చాలామందిని ఆకట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X