సిక్స్ ప్యాక్ కోసం పాట్లు.. అందుకోసమే చెమటోడ్చుతున్న సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ బుల్లితెరపై స్టార్ అన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై తన మ్యాజిక్, డ్యాన్స్, నటన, కామెడీ టైమింగ్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ ఇప్పుడు స్టార్డంను సొంతం చేసుకున్నాడు. బుల్లితెరపై ఏడేళ్లుగా తన హవాను కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే సుధీర్ మాత్రం వెండితెరపై అంతటి ఫాలోయింగ్‌ను సంపాదించుకోలేకపోతోన్నాడు. ఇప్పటికే రెండు సినిమాలతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మళ్లీ ఇప్పుడు కొత్త కోణంలో కనిపించేందుకు రెడీ అయ్యాడు.

బుల్లితెరపై సక్సెస్..
సుధీర్‌కు బుల్లితెరపై తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. రష్మీ సుధీర్ ట్రాక్ గత కొన్నేళ్లు జనాలను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. అయితే ఆ ఒక్క క్యాటగిరీలోనే కాకుండా సుధీర్ తన టాలెంట్‌ను బయటపెట్టడంతో ఇంతటి క్రేజ్ వచ్చింది. డ్యాన్సుల్లో సుధీర్ బుల్లితెరను ఊపేస్తుంటాడు.

వెండితెరపై వర్కవుట్ కాలేదు..
అయితే వెండితెరపై మాత్రం సుధీర్ ఇమేజ్ అంతగా వర్కవుట్ కాలేదు. చేసిన రెండు సినిమాలు కూడా అంతగా ఆడలేదు. సాప్ట్ వేర్ సుధీర్ అంటూ బాగానే ట్రై చేశాడు. ధన్యా బాలకృష్ణ వంటి గ్లామర్ నటిని హీరోయిన్‌గా పెట్టుకున్నాడు. కానీ సినిమా ఆశించినంతగా సక్సెస్ కాలేదు.

అలా ప్రయత్నించినా కూడా..
అయితే సుధీర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన త్రీ మంకీస్ సినిమా కూడా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్, సుధీర్ కలిసి చేసిన త్రీ మంకీస్ సినిమా కూడా అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఈ సారి సుధీర్ మరింత కొత్తగా ట్రై చేస్తున్నట్టున్నాడు.

కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా..
సుడిగాలి సుధీర్ ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు. లాక్డౌన్ రావడంతో సుధీర్ ప్లానింగ్స్ అన్నీ కూడా తారుమారయ్యాయి. అయితే సుధీర్ ప్రస్తుతం తన సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఈ మేరకు సుధీర్ చేసిన కష్టం స్పష్టంగా కనిపిస్తోంది.

జిమ్‌లో కుస్తీలు..
సుధీర్ ప్రస్తుతం జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నట్టున్నాడు. అందుకే ఇలా జిమ్‌లో వర్కవుట్లతో కుస్తీలు పడుతున్నాడు. ఇప్పటికే సుధీర్ శరీరాకృతిలో ఎంతో మార్పులు వచ్చాయి. ఇక త్వరలోనే అందరికీ తన కండలు తిరిగిన దేహాన్ని పరిచయం చేసి షాకిచ్చేలా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











