ఐశ్వర్య కూతురికి పేరు సూచించండి
అందాల తార ఐశ్వర్య మరో బుల్లి ఐశ్వర్యకు నవంబర్ 16న జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె పేరు మీద దేశ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. బచ్చన్ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆమె నిక్ నేమ్ 'Beti B"(బేటి బచ్చన్)గా డిసైడ్ చేశారు కూడా. ఇక ఆమె అసలు పేరు K అక్షరంతో మొదలవుతుందని న్యూమరాజిస్టులు, జ్యోతిష్యులు నిర్ణయించారు కూడా. జాతకాలపై, సంఖ్యా శాస్త్రంపై అపార నమ్మకం ఉన్న బచ్చన్ కుటుంబ సభ్యులు కూడా K అనే అక్షరంతోనే పేరు పెట్టాలని నిర్ణయించారు కూడా. మరి అందాల ఐశ్వర్య కూతురంటే ఆషామాషీ కాదు కదా. అందుకే Kతో మొదలయ్యే అరుదైన నేమ్ కోసం అన్వేషిస్తున్నారు బచ్చన్ కుటుంబ సభ్యులు.
మరి మీరైతే బుల్లి ఐశ్వర్యకు ఏం పేరు పెడతారు? మీ అభిప్రాయాన్ని వన్ ఇండియాతో పంచుకోండి.మీ అభిప్రాయాలను ఈ కింది ఈమెయిల్ కు పంపండి.
[email protected]


Click it and Unblock the Notifications











