twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్కమాట నోరుజారి చిక్కుల్లో పడ్డ హీరో: పార్టీ పెట్టిన మూడో రోజుకే

    కన్నడ హీరో ఉపేంద్ర రాజకీయ నేతలు డబ్బులిస్తే తీసుకోండి, కానీ ఓటుమాత్రం వారికి వేయవద్దు అని వ్యాఖ్యానించి పార్టీ పెట్టిన మూడు రోజుల్లోనే లీగల్ కేసుల్లో ఇరుక్కున్నాడు.

    |

    సినిమా తారలంతా రాజకీయాల్లోకి రావటానికి తహ తహలాడుతున్నారు ఇప్పటికే తమిళ నాట రజినీకాంత్, కమల హాసన్ ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. కమల్ ఇప్పటికే సొంత పార్టీ అనే నిర్ణయం లో ఉండగా రజినీకాంత్ ఇంకా ఏ నిర్ణయమూ తేల్చనే లేదు.. ఇక మనదగ్గర పవన్ చురుకుగా పావులు కదుపుతూనే ఉన్నాడు.

     కన్నడ హీరో ఉపేంద్ర

    కన్నడ హీరో ఉపేంద్ర

    వీళ్ళంతా ఎవరి హడావిడిలో వాళ్ళుండగానే గప్ చిప్ గా తన పార్టీ ని ప్రకటించేసాడు కన్నడ హీరో ఉపేంద్ర. విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ ఉన్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర రాజకీయ రంగప్రవేశం చేశారు. 'కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ' పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించాడు.

    మొదటి రోజునే లీగల్ కేసు

    మొదటి రోజునే లీగల్ కేసు

    అయితే ఆ సందర్భం లోనే మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చే క్రమం లో చిన్న పొరపాటు చేసేసారు. ఒక మాట జారటం తో పార్టీ పెట్టిన మూడు రోజుల్లోనే లీగల్ కేసుల్లో ఇరుక్కున్నాడు. ముందు ముందు ఎదుర్కోబోయే సమస్యలని ముందే ఇప్పుడే చూపించింది ఈ ఘటన

     కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ

    కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ

    రియల్‌ స్టార్‌ ఉపేంద్ర కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ ప్రారంభించే సమయంలో అవినీతిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆయనపై ఇక్కడి శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పార్టీ ప్రారంభ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఉపేంద్ర సమాదానమిస్తూ...

    డబ్బులిస్తే తీసుకోండి

    డబ్బులిస్తే తీసుకోండి

    ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు డబ్బులిస్తే తీసుకోండి, కానీ ఓటుమాత్రం వారికి వేయవద్దు అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై జేడీయూ ప్రధాన కార్యదర్శి ఎన్‌.నాగేశ్‌ గురువారం శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    English summary
    Days after Upendra announced the formation of his political party, a case has been filed against the actor for a comment during his hour-long interaction with the media recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X