పెళ్లి వేడుకలో షారుక్ కూతురు సందడి, త్వరలో సినిమాల్లోకి? (ఫోటోస్)
బాలీవుడ్లోని సూపర్ స్టైలిష్ స్టార్ కిడ్స్‌లో షారుక్ ఖాన్ కూతురు సుహానాను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ పాప ఎక్కడికెళ్లినా తన యాటిట్యూడ్, స్టైలిష్ అప్పియరెన్స్‌తో అందరి కళ్లూ తన వైపుకు తిప్పుకుంటుంది. సుహానా ఇటీవల న్యూఢిల్లీలో ఓ పెళ్లి వేడుకకు హాజరైంది. ఈ వేడుకలో సుహానా ఖాన్ ట్రెడిషనల్ లుక్ ఫోటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ప్రెట్టీ లుక్
ఈ పెళ్లి వేడుకలో సుహానా ఖాన్ సబ్టిల్ గ్రీన్ ఎంబెల్లిష్డ్ మోనిషా జైసింగ్ లెహంగా ధరించింది. తన నడుము భాగాన్ని ప్రదర్శిస్తూ ఆమె ఫోజులు ఇచ్చిన తీరు యువతను ఆకట్టుకుంటోంది.

హడావుడి అంతా ఆమెదే
ఈ పెళ్లి వేడుకలో సందడి అంతా తనదే అన్నట్లు సుహానా ఖాన్ హల్ చల్ చేసింది. తన స్నేహితురాలితో కలిసి సుహానా ఖాన్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

పర్ఫెక్ట్ ఫ్రేమ్
పెళ్లి వేడుకలో వధువుతో కలిసి..... సుహాన్ అండ్ గ్యాంగ్. ఇలాంటి మధురమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలు జీవితంలో ఎప్పటికీ అలా గుర్తుండి పోతాయి.

అందానికి మెరుగులు దిద్దుకుంటూ
పెళ్లి వేడుకకు సిద్దమయ్యే ముందు తన అందానికి మరింత మెరుగులు దిద్దుకుంటూ సుహానా ఖాన్

మరిన్ని ఫోటోస్
పెళ్లి వేడుకలో సుహానా ఖాన్‌కు సంబంధించిన మరిన్ని ఫోటోలు. ఇవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందా?
గతంలో ఓ ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్ మాట్లాడుతూ... తన కూతురు సుహానా యాక్టర్ అవ్వాలనుకుంటోందని, స్టేమీద బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. తనకు సినిమాలంటే ఇష్టం... అందుకే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటోంది' అని వెల్లడించారు. దీన్ని బట్టి త్వరలో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











