Prasanna Vadanam Twitter Review: ముఖాలు గుర్తుపట్టలేని హీరో.. అవే హైలైట్‌గా.. సుహాస్ మూవీ ఎలా ఉందంటే!
టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ సుహాస్ ఒకడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లను అందుకున్న అతడు.. ఇప్పుడు అదే ఊపును కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.
ఇందులో భాగంగానే తాజాగా 'ప్రసన్న వదనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రదర్శితం అయిపోయాయి. ఈ నేపథ్యంలో సుహాస్ చిత్రం ట్విట్టర్ రివ్యూను మీరే చూసేయండి మరి!

సుహాస్ నుంచి మరో ప్రయోగం
టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన చిత్రమే 'ప్రసన్న వదనం'. అరుణ్ వైకే ఈ మూవీని మణికంట జేఎస్, ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. ఇందులో రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌లుగా చేశారు. అలాగే, ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవా హర్షలు కీలక పాత్రల్లో నటించారు.

సరికొత్త కాన్సెప్టుతో వచ్చేసింది
ఫేస్ బ్లైండ్‌నెస్ (ముఖాలను గుర్తించలేని సమస్య' ఉన్న హీరో.. ఈ ప్రాబ్లం వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అసలు అతడికి ఇది ఎలా వచ్చింది? దీనివల్ల ఎదురైన సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? అనే అంశాలతో రూపొందిన చిత్రమే 'ప్రసన్న వదనం'. సరికొత్త కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేసింది.
పెద్ద ట్విస్టుతో ఫస్టాఫ్ పూర్తి
సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' మూవీని చూసిన ఓ నెటిజన్ X (ట్విట్టర్) ఖాతాలో 'ప్రసన్న వదనం మూవీ ఫస్టాఫ్ ఇప్పుడే పూర్తి అయింది. ఎవరూ ఊహించని పెద్ద ట్విస్టుతో ఇది ముగుస్తుంది. ఫేస్ బ్లైండ్‌నెస్ ఉన్న వ్యక్తిగా సుహాస్ అద్భుతంగా నటించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. సెకెండాఫ్ కోసం అంతా మంచిగా సెటప్ చేసి పెట్టుకున్నారు' అని తెలిపారు.
సుహాస్‌కు మరో క్లీన్ హిట్
'ప్రసన్న వదనం' సినిమాను చూసిన ఓ నెటిజన్ X (ట్విట్టర్) ఖాతాలో ఇలా స్పందించారు. 'ప్రసన్న వదనం.. సుహాస్‌కు మరో క్లీన్ హిట్. విజయం సాధించినందుకు ఈ చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్. టాలీవుడ్‌లో ఇదే మొదటి సమ్మర్ హిట్ మూవీ. అర్జున్ డైరెక్షన్ సింపుల్‌గా, సూపర్‌గా ఉంది. రాశీ సింగ్ పెర్ఫార్మెన్స్ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు' అని చెప్పారు.
డైరెక్షన్, ఆ సీన్స్ హైలైట్
సుహాస్ హీరోగా చేసిన 'ప్రసన్న వదనం' వీక్షించిన మరో నెటిజన్ ఇలా స్పందించారు. 'ప్రసన్న వదనం సినిమాను ఇప్పుడే చూశాను. ఇది ఓకే అనిపించేలా ఉంది. డైరెక్షన్, ఎడిటింగ్ చాలా బేసిక్‌గా ఉన్నాయి. ఓ సన్నివేశంలో హీరోను హీరోయిన్ హగ్ చేసుకుంటుంది. అదే సీన్‌ను మరో యాంగిల్ నుంచి చూపించారు. ఇది బాగా హైలైట్‌గా అనిపించింది' అని చెప్పుకొచ్చారు.
అస్సలు మిస్ కావొద్దు
'ప్రసన్న వదనం' సినిమాను చూసిన ఇంకో నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో 'యూకేలో ప్రసన్న వదనం సినిమాను చూశాను. ఇది సినిమాటిక్ డైమండ్‌లా అనిపించింది. అదిరిపోయే ట్విస్టులు, ఆసక్తిని రేపే క్లైమాక్స్‌తో అద్భుతంగా ఉంది. థ్రిల్లర్ మూవీలు కోరుకునే ప్రతి ఒక్కరూ దీన్ని తప్పుకుండా చూడాలి. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్' అని రాసుకొచ్చారు.

ఓవరాల్‌గా అలాంటి టాక్
ఫుల్ జోష్‌లో ఉన్న సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్‌ను బట్టి దీనికి మంచి టాక్ వచ్చింది. చాలా మంది ఈ మూవీ బాగుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్టు, ట్విస్టులు, క్లైమాక్స్ పార్ట్ అదిరిపోయిందని చెప్తున్నారు. మరి థియేటర్లలో మౌత్ టాక్ ఎలా వస్తుందో కాసేపట్లోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











