అప్పుడు అల్లు అర్జున్ తో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో...

By Sindhu

పవన్ కళ్యాణ్, విష్ణువర్ధన్ ల కాంబినేషన్లో కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చి పరిసరాల్లో జరుగుతోంది. అక్కడ కొన్ని సన్నివేశాలను, పాటలను షూట్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా పూర్తయిన వెంటనే, వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ నటించే 'గబ్బర్ సింగ్' (దబాంగ్ రీమేక్) సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో గణేష్‌బాబు నిర్మిస్తున్న భారీ చిత్రం 'గబ్బర్‌సింగ్‌'. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో 'తీన్‌మార్‌' వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన నటుడు గణేష్‌బాబు మళ్ళీ పవన్‌కళ్యాణ్‌ హీరోగా 'గబ్బర్‌సింగ్‌' అనే ప్రెస్టీజియస్‌ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నిర్మాతగా గణేష్‌బాబు మీద వున్న నమ్మకంతో పవన్‌ కళ్యాణ్‌ వెంటనే మళ్ళీ ఈ బేనర్‌కి డేట్స్ ఇవ్వడం విశేషం.హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందే ఈ సినిమాలో హీరోకి తల్లిగా సీనియర్ నటి సుహాసిని నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో తల్లి పాత్ర కూడా ప్రాధాన్యత వున్నది కావడంతో ఆమెను ఎంపిక చేశారట. కొన్ని సంవత్సరాలుగా నటనకి దూరంగా వున్న సుహాసిని అల్లు అర్జున్ 'వరుడు "సినిమాతో మళ్ళీ తెరమీదకి వచ్చిన విషయం తెలిసిందే..ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X