చిరంజీవి దోశ...అలా ఫేమస్ అయింది!
హైదరాబాద్: మసాలా దోశ, సెట్ ధోశ, ఎమ్మేల్యే దోశ, ఆయనియన్ దోశ లాంటివి అన్ని హోటళ్లలోనూ దొరుకుతాయి. కానీ కొన్ని హోటళ్లలో చిరంజీవి దోశ కూడా ఉంటుందండోయ్. ప్రముఖ నటి సుహాసిని ఇష్టంగా తినే దోశ కూడా ఇదే. ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
https://www.facebook.com/TeluguFilmibeat
హైదరాబాద్ వస్తే చట్నీస్ లో చిరంజీవి దోశ టేస్టు చేయకుండా వెళ్లను. ఈ హోటల్‌లో తయారయ్యే ఓ దోశను చిరంజీవి అమితంగా ఇష్టపడేవారు. దీంతో అది చిరంజీవి దోశగా మెనూలో టాప్ ప్లేసు కొట్టేసింది అని ఆమె చెప్పుకొచ్చారు. మంచు పల్లకి సినిమా షూటింగ్ కోసం 1982లో తొలసారి హైదరాబాద్ వచ్చానని చెప్పుకొచ్చింది.

అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్న నాగార్జునను సినిమాల్లోకి తేవడం ఇష్టం లేదని నాగేశ్వరరావు గతంలో తనతో చెప్పారని, అయితే బంధువులు, స్నేహితులు హీరోను చేయాలని పట్టుబడుతున్నారని చెప్పేవారని తన గత జ్ఞాపకాలను సుహాసిని గుర్తు చేసుకున్నారు.
చెన్నై తర్వాత తాను ఎక్కువ ఇష్టపడే నగరం హైదరాబాదేనని....తెలుగు వంటకాల్లో ఒకటైన ఉలవచారు అంటే ఎంతో ఇష్టం. అదే విధంగా గ్రీన్ పార్కు హోటల్ లో ఆచారి వోజిటబుల్(ఊరగాయ) అంటే చాలా ఇష్టం. బంజారాహిల్స్ లోని తూతూ తనేజా కాటన్ చీరలంటే చాలా ఇష్టం...ఇలా తన ఇష్టాలను చెప్పకొచ్చింది.


Click it and Unblock the Notifications











