కళ్యాణ్ రామ్ చిత్రం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఆమె పాత్రే హైలెట్
నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు సతీష్ వేగేశ్న కలిసి చేస్తోన్న చిత్రం ఎంత మంచివాడవురా. పటాస్ లాంటి హిట్ తరువాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ ఆరేంజ్ సక్సెస్‌ను చూడలేకపోతున్నాడు. ఎన్ని జానర్స్ ట్రై చేసినా అదృష్టం కలిసి రావడం లేదు. చివరకు మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి లవర్ బాయ్‌గా చేసినా.. సస్పెన్స్ థ్రిల్లర్‌ను చేసినా లక్ మాత్రం కలిసి రాలేదు. తాజాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో మరో ప్రయత్నం చేస్తున్నాడు.

టీజర్‌తో అంచనాలు..
ఇప్పటికే విడుదల చేసిన టీజర్.. సినిమాపై ఎంతగా హైప్ క్రియేట్ చేసిందో తెలిసిందే. కళ్యాణ్ రామ్ లుక్ కొత్తగా ఉండటం.. టీజర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చేసింది.

సుహాసిని పాత్ర హైలెట్..
ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సుహాసిని ఓ కీలకపాత్రలో నటిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈమె పాత్ర చుట్టే కథ మొత్తం తిరుగుతుందని టాక్. తన పాత్రకు అంత ఇంపార్టెన్స్ ఉండబట్టే చాలా కాలం తరువాత మళ్లీ తెలుగులో నటించేందుకు సుహాసిని ఒప్పుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఆమె పాత్రకు సంబంధించిన షూట్ జరుగుతోంది. పల్నాడులోలో జరుగుతున్న ఈ షూటింగ్‌కు సంబంధించి లీకైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇద్దరికీ గడ్డు కాలమే..
శతమానం భవతి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సతీష్.. రెండో సినిమా శ్రీనివాస కళ్యాణంతో నిరాశపరిచాడు. అటు కళ్యాణ్ రామ్, ఇటు దర్శకుడు సతీష్‌కు ఈ సినిమా హిట్టవ్వడం అవసరం. మరి ఈసారైనా వీరి టైమ్ బాగుందో లేదో చూడాలి. ఈ చిత్రం గుజరాతి హిట్ మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కళ్యాన్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సంక్రాంతి బరిలోకి
మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు సంక్రాంతికి కర్ఛీఫ్ వేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో పోటీ పడుతున్నారు. జనవరి 12 ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నట్లు ఇదివరకే ప్రకటించినా.. చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు. అయితే ఇలాంటి పెద్ద సినిమాల వరుసలో.. ఎంతమంచివాడవురా రిలీజై హిట్ అవుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











