నటి సుహాసినితో..పెళ్లాం హత్య!
చంటిగాడు, సుందరానికి తొందరెక్కువ లాంటి సినిమాల్లో నటించి....అవి పెద్దగా వర్కౌట్ కాక పోవడంతో బుల్లితెర నాయికగా మారిన సుహాసిని ముఖ్య పాత్రలో మరో సినిమా తెకెక్కింది.'పెళ్లాం హత్య" పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌విఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై రామకృష్ణ వీరనాల స్వీయనిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.
ఈ సినిమా గురించి దర్శకనిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ....నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మగువలు క్రూరంగా హత్యకు గురవుతున్న వైనం ఎంత బాధాకరమో చూపిస్తున్నామని తెలిపారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందన్నారు.
ఈ సినిమాలో ఇంకా...రామకృష్ణ, రితిక, కృష్ణభగవాన్, సుభాష్ యాదవ్, రవికిషోర్, పూర్ణిమ, యాదగిరి, నాయుడు జవ్వాది తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











