twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    150 కోట్ల వెనుక కారణం తెలుసా...!సుజిత్ ప్రభాస్ ని హ్యాండిల్ చేయగలడా ?

    |

    రన్‌ రాజా రన్‌తో దర్శకుడిగా పరిచయమై టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకున్న సుజిత్‌ తన రెండో సినిమాకే నూట యాభై కోట్ల బడ్జెట్‌ సాధించాడు. మొదట్లో యాభై కోట్లలో చేద్దామనుకున్న ఈ ప్రాజెక్ట్‌ షేప్‌ మారిపోయి నూట యాభై కోట్ల సినిమాగా తయారైంది. సుజిత్‌పై యువి క్రియేషన్స్‌ అధినేతలు, ప్రభాస్‌ చూపిస్తున్న నమ్మకం అంతా ఇంతా కాదు. ఏ దర్శకుడికైనా ఇది కలలాంటి ప్రాజెక్ట్‌.

    యువి క్రియేషన్స్‌లో ఇప్పటివరకు తెరకెక్కిన ఒకే ఒక్క భారీ చిత్రం మిర్చి. నలభై కోట్లతో తీసిన ఆ చిత్రం తర్వాత వారు ఎక్కువగా చిన్న చిత్రాలకే మొగ్గు చూపారు. మరి నూట యాభై కోట్ల సినిమాని తలపెడుతూ సుజిత్‌లాంటి యువ దర్శకుడిని ఎంచుకున్నారంటే వారి ధైర్యాన్ని ఏమనుకోవాలి? ఇంతవరకు దర్శకుల టాలెంట్‌నే నమ్ముతూ వచ్చిన యువి క్రియేషన్స్‌ ఈసారి కూడా సుజిత్‌ ప్రతిభనే నమ్ముతూ ఇదతను హ్యాండిల్‌ చేస్తాడనే కాన్ఫిడెన్స్‌తో అతను అడిగిన వనరులు అన్నీ సమకూరుస్తున్నారు.

     Sujeeth hits the Jackpot

    శర్వానంద్‌ హీరోగా 'రన్‌ రాజా రన్‌' సినిమాను 2014లో విడుదల చేశాడు దర్శకుడు సుజిత్‌. పదికోట్ల లోపు బడ్జెట్‌తోనే నిర్మితమైన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ప్రభాస్‌ను కలిసి ఓ కథ వినిపించాడు సుజిత్‌. ప్రభాస్‌ కూడా ఆ సినిమా చేసేందుకు అంగీకరించాడు. అయితే ప్రభాస్‌ పూర్తిగా 'బాహుబలి'కే అంకితమైపోవడంతో ఆ ప్రాజెక్టు లేటవుతూ వచ్చింది. ఎట్టకేలకు 'బాహుబలి-2' షూటింగ్‌ కూడా పూర్తి చేసుకున్న ప్రభాస్‌ సుజిత్‌ సినిమాను లైన్‌లోకి తెచ్చేసాడు. ఈ సినిమా నిన్ననే (13 ఫిబ్ర‌వ‌రి) యు.వి .క్రియోష‌న్స్ ఆఫీస్ లో నిరాడంబ‌రంగా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ కార్క‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు గారు హ‌జ‌రయ్యారు. ఇంకా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌, లు హ‌జ‌ర‌య్యారు.

    అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఈ సినిమా మొదట బడ్జెట్ 50 కోట్లేనట. అయితే ప్రభాస స్టార్ వేల్యూని బట్టే ఇప్పుడు 150 కోట్లకు చేరిందన్నది అసలు సంగతి. కథ చెబుతున్నప్పుడు ఈ సినిమా బడ్జెట్‌ రూ.50 కోట్లని నిర్మాతలకు చెప్పాడు సుజిత్‌. అయితే ఇప్పుడు ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నాడు ప్రభాస్‌. అందుకే ఇదే కథకు మరికొంత భారీతనం కూడా సమకూర్చాలనుకుంటున్నాడు. మొత్తానికి అలా ఈ సినిమా బడ్జెట్‌అమాంతం 150 కోట్లకు చేరింది . ప్రస్తుతం ప్రభాస్‌ ఇమేజ్‌ దృష్ట్యా ఆమాత్రం ఉండాల్సిందే కదా.

    150 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్‌ సినిమా అంటే అదేమంత ఆశ్చర్యకరమైన వార్త కాదు. బాహుబలితో వచ్చిన ఇమేజ్‌తో, పాన్‌ ఇండియాగుర్తింపుతో ప్రభాస్‌ సినిమాకి ఆమాత్రం ఖర్చు పెట్టవచ్చు. మార్కెట్ కూదా ఆ స్థాయిలో చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమితంటే... అంత భారీ బడ్జెట్‌ చిత్రాన్ని హ్యాండిల్‌ చేపే బాధ్యత ఎవరికి ఇచ్చారనేది కూడా చూస్తే మాత్రం 150 కోట్ల సినిమా అంటే ఖచ్చితంగా అనుభవజ్ఞుడైన దర్శకుడు వుండాలి. కానీ ఇంతవరకు కనీసం పది కోట్ల సినిమా అయినా హ్యాండిల్‌ చేసి ఎరుగని సుజిత్‌ చేతిలో ఈ భారీ చిత్రాన్ని వుంచారు. సుజిత్ మీద అంత నమ్మకం ఉంచిన నిర్మాతలకే కాదు... ఇంత సాహసం చేయబోతున్న సుజిత్ కి కూడా ఆల్ ద బెస్ట్...

    English summary
    It is heard that earlier Sujeeth asked only Rs 50 Crore but now producer has hiked the budget as they are confident on the creative work of Sujeeth and craze of Prabhas. Sujeeth’s first directorial venture was made on the budget of Rs 10 Cr and now his second venture will made on the mammoth budget of Rs 150 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X