‘జాక్వలైన్‌కు 200 కోట్ల కుంభకోణంతో సంబంధం లేదు.. ఆమెతో నాకు సీరియస్ రిలేషన్‌షిప్’
బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించి 200 కోట్ల కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు ఊరట లభించింది. బలవంతపు వసూళ్లు, ఇతర నేరాలను విచారించేందుకు సుకేష్ చంద్రశేఖర్‌ను ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్బంగా ఆయన కోర్టులో తన వాదనను వినిపిస్తూ.. ఈ కేసులో జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. దీంతో ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వలైన్‌కు ఉపశమనం లభించినంత పనైంది. సుకేష్ చంద్రశేఖర్ కోర్టుకు చెప్పిందేమిటంటే?

ఫార్మా కంపెనీ అధినేతలను బెదిరించి
దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేతలను బెదిరించి బలవంతంగా వసూళ్లకు పాల్పడటంపై సుకేష్ చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి.. తీహార్ జైల్లో పెట్టారు. అయితే తీహార్ జైలు నుంచి ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడటం.. దందా చేయడం విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో విచారణ జరుపగా అమిత్ షా పీఏను అంటూ బెదిరించారనే విషయం బయటపడింది. అలాగే సుకేష్ చంద్రశేఖర్‌కు జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం ఈడీ, ఇతర దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత పలుమార్లు ఆమెను ఈడీ విచారించింది.

200 కుంభ కోణం కేసులో జాక్వలైన్‌ను
ఇదిలా ఉండగా, సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన 200 కుంభ కోణం కేసులో జాక్వలైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను విచారిస్తున్న సమయంలోనే సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఆమెకు అక్రమంగా డబ్బు ట్రాన్స్‌ఫర్ అయినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా జాక్వలైన్ అకౌంట్‌లోని 7.2 కోట్ల మొత్తాన్ని సీజ్ చేశారు.

జాక్వలైన్‌తో నాకు సీరియస్ రిలేషన్‌షిప్
గత నెల కూడా జాక్వలైన్ గురించి తన లాయర్లతో సుకేష్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. జాక్వలైన్‌తో నాకు సీరియస్ రిలేషన్‌షిప్ ఉంది. అయితే తనతో సంబంధం పెట్టుకోవద్దని నోరా ఫతేహి నాతో చెప్పింది. నాకు నోరా ఫతే ప్రతి రోజు 10 సార్లు ఫోన్ చేసేది. నేను ఫోన్ ఎత్తకున్నా పదే పదే నాకు ఫోన్లు చేస్తూనే ఉండేది. అయితే నేను జాక్వలైన్‌తో సీరియస్ రిలేషన్‌లో ఉన్నందున్న నోరా ఫతేహిని పట్టించుకోలేదు అని తన ప్రకటనలోతెలిపారు.

జాక్వలైన్‌కు ఎలాంటి సంబంధం లేదు
తాజాగా పాటియాలా కోర్టుకు హాజరైన సుకేష్ మాట్లాడుతూ... 200 కోట్ల కుంభకోణంకు జాక్వలైన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసు విషయంలో ఆమె ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఆమె రక్షణగా నిలుస్తాను అని సుకేష్ చెప్పినట్టు జాతీయ మీడియా కథనాన్ని వెల్లడించింది.


Click it and Unblock the Notifications











