మా హీరోకీ ఆ లక్షణాలున్నాయి : సుకుమార్
ఈ చిత్రం టైటిల్ గురించి సుకుమార్ మాట్లాడుతూ....'నేను..' అనే మాటలో అహం ఉందనుకొంటారుగానీ - ఆ మాట వెనుక కావల్సినంత ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. వంద మందిలో ఒక్కడిగా ఉండడానికీ, ఆ వంద మందినీ ఒక్కడై నడిపించడానికీ ఆ మాత్రం నమ్మకం ఉండాల్సిందే. మా హీరోకీ ఆ లక్షణాలున్నాయి అన్నారు.
ఇక జులై ఆఖరు వరకూ లండన్‌లోనే చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ నటన, కాస్ట్యూమ్స్, కేశాలంకరణ... ఇవన్నీ కొత్తగా ఉండేలా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకొంది. సిక్స్ ప్యాక్ దేహాకృతిలోనూ కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ చిత్రానికి స్వరాలు అందించడం ఆయనకు ఇదే తొలిసారి.
ఈ చిత్రంలో విలన్ గా విక్రమ్ సింగ్ నటిస్తున్నాడు. హిందీలో మహేష్ భట్ క్యాంప్ లో య-రాబ్ అనే చిత్రం లో హీరోగా చేస్తున్న విక్రమ్ తెలుగులో విలన్ గా బిజీ అవుతానంటున్నాడు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications












