twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా హీరోకీ ఆ లక్షణాలున్నాయి : సుకుమార్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం '1'. మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రమిది. 'నేనొక్కడినే' అనేది ఉపశీర్షిక. కృతి సనన్‌ హీరోయిన్. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ లండన్‌లోని బెల్‌ఫాస్ట్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

    ఈ చిత్రం టైటిల్ గురించి సుకుమార్ మాట్లాడుతూ....'నేను..' అనే మాటలో అహం ఉందనుకొంటారుగానీ - ఆ మాట వెనుక కావల్సినంత ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. వంద మందిలో ఒక్కడిగా ఉండడానికీ, ఆ వంద మందినీ ఒక్కడై నడిపించడానికీ ఆ మాత్రం నమ్మకం ఉండాల్సిందే. మా హీరోకీ ఆ లక్షణాలున్నాయి అన్నారు.

    ఇక జులై ఆఖరు వరకూ లండన్‌లోనే చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్‌ నటన, కాస్ట్యూమ్స్‌, కేశాలంకరణ... ఇవన్నీ కొత్తగా ఉండేలా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకొంది. సిక్స్ ప్యాక్ దేహాకృతిలోనూ కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మహేష్‌ చిత్రానికి స్వరాలు అందించడం ఆయనకు ఇదే తొలిసారి.

    ఈ చిత్రంలో విలన్ గా విక్రమ్ సింగ్ నటిస్తున్నాడు. హిందీలో మహేష్ భట్ క్యాంప్ లో య-రాబ్ అనే చిత్రం లో హీరోగా చేస్తున్న విక్రమ్ తెలుగులో విలన్ గా బిజీ అవుతానంటున్నాడు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

    English summary
    Mahesh who is getting ready to do some death-defying stunts to enthrall his fans. Mahesh Babu has put in a lot of effort to be prepared for the breath taking action sequences in his upcoming flick '1 - Nenokkadine'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X