నాకు నేనే శిష్యుడిని అయిపోయాను.. బుచ్చిబాబుపై సుకుమార్ ఎమోషనల్
సినీ ఇండస్ట్రీలో గురు శిష్యుల బంధం గురించి అందరికీ తెలిసిందే. నటన, దర్శకత్వంలో దిగ్గజాల వద్ద శిష్యరికం చేసి ఆ తరువాత గురువుల పేర్లను నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ తాజాగా సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు మాత్రం తనదైన ముద్రను వేసి తన స్థానాన్ని పదిలం చేసుకోవడమే కాకుండా.. సుకుమార్‌ను అందనంత ఎత్తులో నిలబెట్టేశాడు. తన గురువు సుకుమార్ అంటూ ఆయన స్థాయిని పెంచేశాడు.

సుకుమార్ శిష్యుడిగానే..
ఉప్పెన సినిమాపై ఇంతటి భారీ అంచనాలు ఏర్పడటానికి కారణం కూడా సుకుమారే. ఉప్పెన విడదలకు ముందు అంతా కూడా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు అనే రాసేవారు. కానీ ఇప్పుడు తనకంటే ఓ బ్రాండ్ ఏర్పడింది. బుచ్చిబాబు సన వల్ల సుకుమార్ గౌరవం మరింతగాపెరిగింది.

బుచ్చిబాబు అలా..
ఉప్పెన ప్రమోషన్ సమయంలో సుకుమార్ పేరు ప్రస్తావించకుండా ఇంటర్వ్యూలో ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రతీసారి సుకుమార్‌తో కలిసి పని చేసిన రోజులను తలుచుకున్నాడు. ఈ కథను మొదటగా వినిపించిన రోజును కూడా గుర్తు చేసుకున్నాడు.

వంద కోట్ల సినిమా..
ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. శిష్యుడి మీద ప్రేమతో వంద కోట్ల సినిమా అవుతుందని అన్నాడేమో అని అందరూ భావించారు. కానీ సినిమా విడుదలయ్యాక నిజంగానే ఉప్పెనలా కలెక్షన్లు వెల్లువెత్తుతున్నాయి.

హాట్ టాపిక్..
ఇప్పుడు బుచ్చిబాబు గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఎక్కడ చూసినా బుచ్చిబాబు, ఉప్పెన సినిమా గురించే చర్చలు నడుస్తున్నాయి. బుచ్చిబాబు కూడా తన తదుపరి ప్రాజెక్ట్‌లను స్టార్ హీరోలతోనే తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడని తెలుస్తోంది. తన శిష్యుడి విజయాన్ని చూసిన సుకుమార్ ఎమోషనల్ అయ్యాడు.

సుకుమార్ ఎమోషనల్..
నువ్వు నన్ను గురువును చేసేసరికి.. నాకు నేను శిష్యుడిని అయిపోయాను.. ఇంత గొప్ప సినిమా తీయడానికి, నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా? అని.. నాకు నేను శిష్యుడిని అయిపోతే తప్పా అదేంటో తెలుసుకోలేను.. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా'నా' బుచ్చిబాబు 'ఉప్పెన'0త ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు.. అంటూ బుచ్చిబాబుపై సుకుమార్ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











