»   » మహేష్‌ను మోసం చేసా, రివేంజ్ తీర్చుకుంటా: సుకుమార్

మహేష్‌ను మోసం చేసా, రివేంజ్ తీర్చుకుంటా: సుకుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబుతో గతేడాది ‘1 నేనొక్కడినే' సినిమా తీసిన సుకుమార్..... సక్సెస్ కొట్టలేక పోయారు. భారీ అంచనాలతో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. అయిత మహేష్ బాబుతో ఎలాగైనా ఓ హిట్ సినిమా చేస్తాను అనే పట్టుదలతో ఉన్నారు సుకుమార్.

ఈ విషయమై ఇటీవల ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ... ఒక సినిమా ఫ్లాప్‌ అయితే ఆ డైరెక్టర్‌ని ఆ సినిమా హీరోగానీ, నిర్మాతలుగానీ ఎలా చూస్తారో నాకు తెలీదు గానీ, మహేష్‌ నన్ను ఎంత అభిమానిస్తాడో మాటల్లో చెప్పలేను. అలాగే 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాతలకు కూడా నేనంటే ఎంతో అభిమానం.

Sukumar about Mahesh Babu '1 Nenokkadine' movie

‘1 నేనొక్కడినే' సినిమా ఫలితానికి రివెంజ్‌ తీర్చుకోవాలని వుంది. మహేష్‌తో ఒక మంచి సూపర్‌హిట్‌ మూవీ తియ్యాలన్నది నా గోల్‌. నా నెక్స్‌ట్‌ మూవీ అదే అని నేను చెప్పడం లేదు. మహేష్‌ నన్ను పూర్తిగా నమ్మాడు. 1 సినిమా కు నేను అతన్ని మోసం చేశాను అనుకుంటున్నాను. అందుకే అతనికి ఒక హిట్‌ సినిమా చేస్తాను అన్నారు.

తన తర్వాతి సినిమా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా చేస్తున్నట్లు వెల్లడించిన సుకుమార్... ఆ తర్వాత మహేష్ బాబు సినిమాపై దృష్టి పెడతానని తెలిపారు. మహేష్ బాబుకు సరిపోయే, హిట్టయ్యే సినిమాను తీస్తానని అంటున్నాడు.

English summary
Sukumar claims to be guilty even Today and felt like he did cheat Mahesh Babu in '1 - Nenokkadine' issue. The Ace Filmmaker says he himself was very disappointed about the failure and only wishes to deliver a memorable hit with Mahesh some time in future if given an opportunity.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu