»   » పవన్‌ కళ్యాణ్‌తో సినిమా: సుకుమార్ ప్లానింగ్ హై రేంజిలో ఉంది!

పవన్‌ కళ్యాణ్‌తో సినిమా: సుకుమార్ ప్లానింగ్ హై రేంజిలో ఉంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘నాన్నకు ప్రేమతో' సినిమా విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు దర్శకుడు సుకుమార్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు.... పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఉద్దేశ్యం ఉందా? అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సుకుమార్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయాలంటే చాలా పెద్ద ప్రాజెక్టు కావాలి. సమాజం పట్ల ఒక ప్రత్యేక దృక్పథం ఉండాలి. దానికోసం ఆలోచన చేస్తున్నామని తెలిపారు.

త్వరలో అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో సినిమా చేసే ఉద్దేశ్యం ఉందని సుకుమార్ తెలిపారు. దానికంటే ముందు దేవిశ్రీ ప్రసాద్ తో సినిమా పూర్తి చేస్తానని తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ తో తాను చేయబోయే తర్వాతి సినిమా కోనసీమ బ్యాక్ డ్రాపులో ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ఉంటుందని స్పష్టం చేసారు.

Sukumar about Pawan Kalyan movie

నిర్మాతగా మీ ప్రయాణం, అనుభవం ఎలా ఉందనే దానిపై సుకుమార్ స్పందిస్తూ....‘కుమారి 21ఎఫ్‌' వంటి చిన్న సినిమాలను నిర్మించడం ద్వారా మంచి విజయాన్ని సాధించాం. సినీ రంగంలో అపజయాలు సహజం. విజయం సాధించినప్పుడు పొంగిపోయి, అపజయం సాధించినప్పుడు కుంగిపోకూడదు. బ్యాలెన్సింగ్‌గా ఉండాలన్నారు.

సుకుమార్ దర్శకత్వం వహించిన ‘నాన్నకు ప్రేమతో ' సినిమా ఇటీవల విడుదలై రూ. 50 కోట్ల షేర్ సాధించింది. మరో వైపు ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. తెలుగు సినిమాల్లో యూఎష్ఏలో ఈ మార్కను అందుకున్న మూడో చిత్రం ఇదే కావడం విశేషం.

English summary
He said, He wish to work with Pawan Kalyan but the project should be Big in terms of social responsibility / message oriented . He is putting all efforts to prepare such script.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu