twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్

    |

    సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఉప్పెన సినిమాతో రచ్చ చేశాడు. అలా సుకుమార్‌కు, తనకు మంచి పేరు సంపాదించి పెట్టుకున్నాడు. గురువుగా సుకుమార్.. శిష్యుడిగా బుచ్చిబాబుకు ఉప్పెన మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు సుకుమార్ గ్యాంగ్‌లోని మరో వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతనే హరి ప్రసాద్ జక్కా. సుకుమార్ స్నేహితుడు. లెక్కల మాస్టారుగా సుకుమార్ ఉన్నప్పుడు ఫిజిక్స్ టీచర్‌గా హరి ప్రసాద్ జక్కా పాఠాలు బోధించేవాడట. అలా ఇప్పుడు హరి ప్రసాద్ జక్కా వల్ల సుకుమార్‌కు మరింత పేరు వచ్చింది.

     సుకుమార్ గ్యాంగ్..

    సుకుమార్ గ్యాంగ్..

    సుకుమార్ తీసిన ప్రతీ సినిమాకు హరి ప్రసాద్ జక్కా పని చేశారట. ఆర్య సినిమా నుంచి కూడా ప్రయాణించారట. వన్ నేనొక్కడినే సినిమాకు కథ అందించింది కూడా ఇతనే. అయితే ఇప్పుడు ప్లే బ్యాక్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మూవీ సక్సెస్ మీట్‌లో సుకుమార్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

     లాజిక్స్ వల్లే..

    లాజిక్స్ వల్లే..

    నాకు లాజిక్స్ అంటే చాలా ఇష్టం.. అలా లాజిక్‌ల వల్లే మేం కలిశాం.. నేను లెక్కలు చెప్పడం.. అతను ఫిజిక్స్ చెప్పడం వల్ల లాజిక్స్ కలిశాయి.. నేను ఏదో ఒకటి మాట్లాడటం.. అతను కూడా ఏదో మాట్లాడటం.. అందులో లాజిక్స్ ఉండటం.. అది నాకు నచ్చడం.. నేను రాసిన కవితలు చెబుతుంటే ఆయన ప్రోత్సహించడం వంటివి జరిగేవని సుకుమార్ చెప్పుకొచ్చాడు.

    గాలి గట్టిగా కొట్టేసింది..

    గాలి గట్టిగా కొట్టేసింది..

    నేను ఇండస్ట్రీకి రావాలా? వద్దా? అని ఆలోచిస్తున్న సమయంలో అంటే.. ఆకు రాలాలా? వద్దా? అని అనుకున్న సమయంలో గాలి గట్టిగా వీస్తే ఏమవుతుంది.. అలా గాలి గట్టిగా వీచింది.. నేను ఇండస్ట్రీలోకి వచ్చి పడ్డాను.. ఆ గాలి ఇతనే అంటూ హరి ప్రసాద్ జక్కా గురించి సుకుమార్ చెప్పుకొచ్చాడు.

     ఆ కమిట్మెంట్..

    ఆ కమిట్మెంట్..

    ఎలాగూ నేను సెటిల్ అయ్యాను కదా.. జాబ్ మానేసి రా అంటే వచ్చాడు..అలా ఆర్య సినిమా నుంచి నాతో కలిసి పని చేస్తున్నాడు.. మా ఇద్దరి మంచి కమిట్మెంట్ ఉంటుంది.. అతను కథ రాసి ముందు చెబుతాడు.. నేను డైరెక్ట్ చేస్తానంటే వదిలేస్తాడు.. నేను చేయనంటే అతను చేస్తాడు అని చెప్పుకొచ్చాడు.

    ప్లే బ్యాక్ నేను చేయాల్సిందే..

    ప్లే బ్యాక్ నేను చేయాల్సిందే..

    అలా ప్లే బ్యాక్ కథ నేను చేయాల్సింది.. కానీ కొన్ని కమిట్మెంట్స్ వల్ల నేను చేయలేకపోయాను.. అందుకే అతడినే చేయమన్నాను.. చేసేశాడు.. అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. ఇలాంటి లాజిక్స్ ఉంటే సినిమాను ఎవ్వరైనా చూస్తారు.. ప్యాన్ ఇండియాలో కూడా ఇది ఆడుతుందని సుకుమార్ ధీమా వ్యక్తం చేశాడు.

    English summary
    Sukumar About Playback And Hari prasad Jakka
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X