twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెప్పడానికి భయపడ్డా..చిరు ఒక్క సీన్ కూడా కట్ చేయవద్దని అన్నారు : సుకుమార్

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం భారీ విడుదలకు రంగం సిద్ధం అయింది. రంగస్థలం చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చిట్టిబాబు పాత్ర రాంచరణ్ కు ఛాలెంజింగ్ రోల్ అని చెప్పొచ్చు. రాంచరణ్, సమంత ఈ చిత్రంలో ప్రధానపాత్రల్లో నటించారు. ఆది పినిశెట్టి రాంచరణ్ సోదరుడి పాత్రలో నటించగా జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. అనసూయ రంగమ్మత్త గా అలరించడానికి సిద్ధం అవుతోంది.

    ఆ విషయం చెప్పడానికి భయపడ్డా

    ఆ విషయం చెప్పడానికి భయపడ్డా

    మొదట ఈ చిత్రాన్ని చిరంజీవి గారు చూసారని సుకుమార్ అన్నారు. ఈ చిత్రం 2 గంటల 50 నిమిషాల నిడివి ఉందని మెగాస్టార్ తో చెప్పడానికి భయపడ్డానని సుకుమార్ తెలిపాడు. సినిమా చూసాక ఒక్క సన్నివేశం కూడా కట్ చేయవలసిన అవసరం లేదని చిరు తనకు భరోసా ఇచ్చినట్లు సుకుమార్ నేడు జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.

    కృతజ్ఞతలు

    కృతజ్ఞతలు

    ఈ చిత్రం కోసం పనిచేసిన వారందరికీ సుకుమార్ కృతజ్ఞతలు తెలియజేశాడు. సినిమా రేపు విడుదల కాబోతుండడంతో ఇప్పుడు ఎక్కువ మాట్లాడడం సరికాదని సుకుమార్ అన్నారు. విడుదల సమయంలో అందరి లాగే తనకు కూడా టెన్షన్ ఉందని సుకుమార్ అన్నారు.

    ప్రపంచ వ్యాప్తంగా

    ప్రపంచ వ్యాప్తంగా

    రంగస్థలం చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఆంధ్రలో ఉదయం 5 గంటల నుంచే షోలు మొదలు అవుతాయని, తెలంగాణాలో ఉదయం 8 గంటల నుంచి షోలు ప్రారంభం అవుతాయని అన్నారు.

    అనసూయకు

    అనసూయకు

    మీడియా సమావేశంలో అనసూయ కూడా రంగస్థలం చిత్రం గురించి తన అనుభవాలని పంచుకున్నారు. అనే మంది నటీనటుల్ని పరిశీలించిన తరువాత రంగమత్త పాత్రకోసం తనని తీసుకున్నారని తెలిపింది. తొలి సన్నివేశంలోనే బాగా నటించానని దర్శకుడు చెప్పడం తనకు అందిన ప్రశంస అని అనసూయ తెలిపింది.

    బెస్ట్ మూవీ

    బెస్ట్ మూవీ

    రాంచరణ్ కెరీర్ లో ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుందని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. సుకుమార్ కథల్లో రంగస్థలం కథ అద్భుతమైననదని అన్నారు. రంగస్థలం చిత్రం ప్రేక్షుకులని మెప్పించడం ఖాయం అని అన్నారు.

    English summary
    Sukumar about Rangasthalam movie run time. Chiranjeevi said ok after watching movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X