రంగస్థలంలో సమంతను అందుకే తీసుకున్నా.. అసలు గుట్టు విప్పిన సుకుమార్
రంగస్థలం సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన రంగస్థలం గురించి తాజాగా సుకుమార్ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుకుమార్ ప్లే బ్యాక్ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ ఎన్నో సంగతులు చెప్పేశాడు. చిత్ర దర్శకుడు హరి ప్రసాద్ జక్కాకు తనకు ఉన్న అనుబంధం గురించి చెబుతూ.. తెలుగు హీరోయిన్ల గురించి కూడా కామెంట్ చేశాడు. ఈక్రమంలో తన సినిమాలోని హీరోయిన్ల గురించి కామెంట్ చేశాడు.

అనన్య నాగళ్ల..
ప్లే బ్యాక్ సినిమాలో అనన్య నాగళ్ల అద్భుతంగా నటించింది.. అందుకే నేను కూడా తెలుగు వాళ్లనే పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. గత కొన్నేళ్లుగా నేను దాదాపుగా తెలుగు వాళ్లనే పెట్టుకుంటున్నాను. ఇక రాబోయే సినిమాల్లో తెలుగు హీరోయిన్‌నే పెట్టుకుంటాను అని సుకుమార్ చెప్పుకొచ్చాడు.

అందరూ అలా..
మామూలుగా నా సెట్‌లో వెంటవెంటనే డైలాగ్స్ మారుతుంటాయి.. ముందు చెప్పినట్టు ఉండవు.. అదే ఒకవేళ తెలుగు హీరోయిన్ అనుకోండి.. వెంటనే డైలాగ్‌లను చెప్పేస్తోంది. లేదంటే హిందీ అమ్మాయి అయితే వాటిని మళ్లీ రాసుకుని నేర్చుకుని చెబుతుంది.. అలా ఆలస్యమవుతుంటుంది అని సుకుమార్ అన్నాడు.

అందుకే సమంతను..
అలాంటి సమస్యలు వస్తున్నాయనే రంగస్థలంలో సమంతను తీసుకున్నాం.. తనకు తెలుగు వచ్చు కాబట్టే తీసుకున్నాం.. నేను డైలాగ్స్ మార్చినా కూడా వెంటనే అక్కడే మళ్లీ తాను కూడా నేర్చుకుని చెప్పేసేదంటూ అసలు విషయం బయటకు చెప్పేశాడు.

పుష్పలో అలా..
పుష్ప సినిమా కోసం ముందుగా ఓ తెలుగు అమ్మాయినే అనుకున్నాం.. బన్నీ కూడా ఓకే అన్నాడు.. ఓ పెద్ద హీరో అలా తెలుగు హీరోయిన్‌ను పెట్టుకోండి అని చెప్పడం మామూలు విషయం కాదు.. కానీ చివరకు కుదరలేదు.. అందుకే తెలుగు వచ్చిన రష్మిక మందాన్నను తీసుకున్నామంటూ సుకుమార్ తన సినిమా సంగతులను చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











