యాక్షన్‌లో గ్రాఫిక్స్.. పుష్ప కోసం సుకుమార్ ప్లాన్ మాములుగా లేదు.. ఆ ఒక్క ఎపిసోడ్ కోసం అన్ని కోట్లా?
పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పుష్ప సినిమా విడుదల కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో దర్శకుడు సుకుమార్ ఫస్ట్ లుక్ టీజర్ తోనే క్లారిటీ ఇచ్చేశాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసమే బడ్జెట్ లో సగానికి పైగా ఖర్చు చేస్తున్నారట.
నటుడు వివేక్‌కు శ్రద్దాంజలి ఘటించిన సినీ ప్రముఖులు.. కన్నీరుమున్నీరైన అభిమానులు

అంతకు మించి అనేలా
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. పోస్టర్స్ అలాగే విడుదలైన టీజర్ ఆడియెన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక రానున్న రోజుల్లో అంతకు మించి అనేలా సాంగ్స్ తో మరింత బజ్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మ్యూజిక్ విషయంలో
దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు సాంగ్స్ కు సంబంధించిన ట్యూన్స్ రెడీ అయ్యాయట. అలాగే మరో రెండు పాటలకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ పాన్ ఇండియా లెవెల్లోనే ఉండాలని దేవిశ్రీప్రసాద్ కూడా కొత్త టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది.

యాక్షన్ లో విజువల్ ఎఫెక్ట్స్..
ఇక సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ పై కూడా దర్శకుడు సుకుమార్ చాలా కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులోనే విజువల్ ఎఫెక్ట్స్ కూడా కీలకం కానున్నాయట. ఆడియెన్స్ అంచనాలకు మించి ఉండాలని నిర్మాతలు కూడా ఖర్చుకు వెనుకాడటం లేదు.
Recommended Video

ఒక్క ఎపిసోడ్ కోసం 40కోట్లు
ఇక సినిమా కోసం దాదాపు 200కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఇక బఫ్జెట్ లో ఎక్కువగా భాగం యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఖర్చు చేయనున్నారట. ముఖ్యంగా ఒక కీలకమైన ఎపిసోడ్ కోసం 40కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అందులో అల్లు అర్జున్ చేసే విన్యాసాలు మాములుగా ఉండట. విజువల్ ఎఫెక్ట్స్ తో కూడా బిగ్ వండర్ క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











