పుష్ప సినిమా వర్కర్స్ కు సుకుమార్ బంపర్ ఆఫర్.. లైట్ బాయ్స్ కి కూడా భారీగా..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. గత సినిమాల కంటే కూడా అత్యధిక వసూళ్లను అందుకుని మార్కెట్లో బన్నీ స్థాయిని కూడా అమాంతంగా పెంచేసింది. ఇక దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు పనిచేసిన కింద స్థాయి వర్కర్లకు అందరికీ కూడా బంపర్ ఆఫర్ ప్రకటించారు. వారి కష్టాన్ని కళ్లారా చూశాను అంటూ తప్పకుండా వారికి ఏదైనా ఒకటి తిరిగి ఇవ్వాలి అని భారీగా నగదు బహుమతిని అందజేయనున్నట్లు తెలియజేశారు.

ఎంతోమందికి సహాయం..
దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎంత మంచి దర్శకుడు గుణంలో కూడా అంతే మంచి వారు అని చాలా సార్లు రుజువు చేశారు. ఆయన చేసిన మంచి పనులు కూడా పైకి ఎవరికీ అంత కనిపించవు. తన సొంత ఊరి పరిసరాలలో కూడా చాలా మందికి సహాయం చేసినట్లుగా చెప్పుకుంటారు. కరోనా పాండమిక్ సమయంలో కూడా ఎంతో మందికి సుకుమార్ ఆర్థికంగానే కాకుండా వైద్యపరంగా కూడా సహాయం అందించడం.

రికార్డులు బ్రేక్ అయ్యేలా
దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాతో మొదటి సారి ఒక అతిపెద్ద సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అల్లు అర్జున్ కెరీర్ లో కూడా ఇదే మొదటి సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా అంచనాలు పెరిగిపోయాయి. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు కూడా నమ్మకంతోనే అన్ని భాషల్లోనూ విడుదల చేశారు. ఇక అనుకున్నట్లుగానే సినిమా ఈజీగా రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో నాన్ బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసింది.

అల్లు అర్జున్ ఎమోషనల్
సినిమా కలెక్షన్స్ విషయంలో అయితే చిత్ర యూనిట్ సభ్యులు చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన థాంక్యూ మీట్ లో అల్లు అర్జున్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా సుకుమార్ గురించి చెబుతూ ఆయన లేకపోతే నేను లేనని అంతేకాకుండా తన జీవితంలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించాడని మీరు ఎవరు లేకపోతే అల్లుఅర్జున్ ఈ స్థాయికి వచ్చే ఉండేవాడు కాదని ఎమోషనల్ అయ్యాడు.

థ్యాంక్స్ చెప్పుకోవాలి..
అయితే సుకుమార్ కూడా సినిమా గురించి తన జీవితం గురించి మాట్లాడుతూ కంట తడిపెట్టుకున్నారు. ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా తన భార్యకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని ఉంది అని నేను తనతో టైం స్పెండ్ చేయకపోయినా కూడా నాకు అన్ని విషయాల్లో మద్దతు పలుకుతూ నా గురించి ఎంతగానో ఆలోచించినట్లు తెలియజేశారు.

అందరికి ఒక లక్ష రూపాయలు
ఏదైనా సినిమాను నేను మొదలు పెట్టాను అంటే పూర్తయ్యే వరకు కూడా హ్యాపీగా ఉండలేను. సినిమా విడుదలైన రోజు రిజల్ట్ పాజిటివ్ గా వస్తే నేను సంతోషంగా ఉంటాను. ఇక ఈ సినిమా చేయడానికి చాలామంది కష్టపడ్డారు. వారిలో కొంతమంది లైట్ బాయ్స్ ప్రొడక్షన్ మెంబర్స్ అలాగే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది చెమటోడ్చి వర్క్ చేశారు. థ్యాంక్యూ మీట్ సందర్భంగా, పుష్ప కోసం పనిచేసిన సెట్ బాయ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ మరియు లైట్ బాయ్స్‌కి ఒక్కొక్కరికి 1 లక్ష ప్రకటిస్తున్నట్లు సుకుమార్ తెలియజేశారు.


Click it and Unblock the Notifications











