twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పుష్ప' మహేష్ కాదన్న కధేనా.. సేఫ్ అయ్యాడు అంటూ కామెంట్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన సుకుమార్!

    |

    టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో కెరీర్ లోనే మొదటి సారి రెండు వందల కోట్ల మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎలాగైనా పుష్ప సినిమాతో అంతకుమించి అనేలా తనకంటూ ఒక పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా ఈ సినిమా ఆశలు వమ్ము చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా ముందు ఓపెనింగ్స్ బాగానే అందుకుంది కానీ.. ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. అయితే ఈ సినిమా విషయంలో సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    అంచనాలు పెంచేసి

    అంచనాలు పెంచేసి

    అల్లు అర్జున్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప మీద ముందు నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా సాంగ్స్ తోనే దేవిశ్రీప్రసాద్ భారీ స్థాయిలో హైప్ ఐతే క్రియేట్ చేశారు. ఇక ఆ తర్వాత ట్రైలర్ కూడా సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన క్రమంలో సినిమా మీద భారీ హైప్ నెలకొంది.

    పుష్ప పాత్ర నచ్చింది అని

    పుష్ప పాత్ర నచ్చింది అని

    ముందు నుంచి స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన బన్నీ మొదటి సారి తన స్టైల్ మొత్తం పక్కన పెట్టేసి ఊర మాస్ లుక్ లో షాక్ ఇచ్చాడు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పుష్ప పాత్ర ఎక్కువగా నచ్చింది అని అంటున్నారు. అయితే ఈ సినిమాను మహేష్ బాబు చేయాల్సి ఉందని, కానీ చేయలేదని అంటున్నారు.

    మహేష్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్‌నే

    మహేష్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్‌నే

    రంగస్థలం తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబును సుకుమార్ డైరెక్ట్ చేయాలనుకున్న సంగతి మనకు తెలిసిందే . ఈ సినిమా క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా డ్రాప్ అయింది. సుకుమార్ ఇటీవల విడుదలైన పుష్ప చేయడానికి అల్లు అర్జున్‌ తో కలిసి ముందుకు వెళ్ళాడు. మహేష్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్‌నే పుష్ప అని చాలా మంది అంటున్నారు.

    సుకుమార్ క్లారిటీ

    సుకుమార్ క్లారిటీ


    మహేష్ బాబు సరైన నిర్ణయం తీసుకున్నాడా లేదా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. దీనిపై స్వయంగా సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. "మహేష్ బాబు కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా కథను చెప్పాను. కానీ అదే కథ అల్లు అర్జున్ కోసం చాలా కథ మారింది' అని సుకుమార్ అన్నారు.

     కథ మాత్రం వేరు

    కథ మాత్రం వేరు


    "మహేష్ బాబు చాలా ఫెయిర్ మరియు నేను అతన్ని కూల్ చేయలేను. కాబట్టి బ్యాక్‌డ్రాప్‌ ఒకటే అయినా కథ మాత్రం వేరు, కానీ అల్లు అర్జున్ క్యారెక్టర్ యాటిట్యూడ్ మారిపోయింది'' అని దర్శకుడు వెల్లడించారు. పుష్ప అల్లు అర్జున్ యొక్క అతిపెద్ద మేక్ఓవర్ మరియు అతని నటన మరియు చేంజ్ ఓవర్ కు భారీ ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ పుష్ప బ్రేక్-ఈవెన్ వెంచర్ కావాలంటే 150 కోట్ల షేర్ రావాలి. ఈ రోజు పరిస్థితులు ఉన్నందున ఇది కఠినంగా కనిపిస్తోంది. సినిమా ఊహించిన దాని కంటే మెరుగ్గా ఆడింది కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల కారణంగా ఈ సినిమా ఇప్పట్లో బ్రేక్ ఈవెన్ చేయడం చాలా కష్టం అనే చెప్పాలి..

    English summary
    Sukumar Clarifies about Pushpa story rejected by Mahesh Babu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X