సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్
హైదరాబాద్: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ బన్నీకి మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ మరోసారి అతనితో కలిసి సినిమా చేయబోతున్నాడు. 'రేసుగుర్రం' హిట్‌తో మంచి జోష్ మీద ఉన్న బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని బన్సీ సొంత బేనర్ గీతా ఆర్ట్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన '1-నేనొక్కడినే' చిత్రం ప్లాపయినప్పటికీ....సుకుమార్ మీద నమ్మకంతో ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడట బన్నీ. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కమర్షియల్ అంశాలతో ఈచిత్రం ఉండబోతోంది.

త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా విషయానికొస్తే...
ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి త్రివిక్రమ్ ముగ్గురు హీరోయిన్లను బుక్ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం 'అత్తారింటికి దారేది'కి పని చేసిన సమంత, ప్రణీతలను తాజా సినిమాలోనూ రిపీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. వీరిద్దరితో పాటు '1-నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్రితి సానన్‌ను కూడా ఎంపిక చేసాడు. కథ పరంగా ఈచిత్రానికి ముగ్గురు హీరోయిన్లు అవసరం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాడట.
గతంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో 'జులాయి' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజా దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్.


Click it and Unblock the Notifications











