పిల్లలతో కలిసి అలా.. పుష్ప సెట్‌లో సుకుమార్ ఫ్యామిలీ సందడి
సుకుమార్ ప్రస్తుతం పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. లెక్కల మాష్టారు ఒక్కో సీన్‌ను ఎంత నిశితంగా పరిశీలిస్తాడు.. ఎంతలా ఆలోచించి తెరకెక్కిస్తాడో అందరికీ తెలిసిందే. తన స్క్రిప్ట్‌ను చివరి వరకు మెరుగులు పెడుతూనే ఉంటానని, సెట్‌కు వచ్చాక లొకేషన్స్‌లొ కూడా ఇంప్రూవ్ చేస్తానని చెబుతూ ఉంటాడీ మాస్టార్. తాజాగా పుష్ప సెట్‌ను వీక్షించేందుకు వచ్చిన తన పిల్లలకు కూడా సుకుమార్ ఏదో వివరిస్తున్నాడు.

అడవుల్లో పుష్ప..
మొన్నటి వరకు పుష్ప షూటింగ్‌ను మారెడుమిల్లిలోని అటవీ ప్రాంతంలో కానిచ్చేశారు. ఆ తరువాత తమిళనాడుకు వెళ్లారు. అక్కడ సాంగ్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు. అయితే మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చారు. తాజాగా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టేశారు.

అదిరే అప్డేట్..
పుష్ప సినిమాలో బన్నీని ఢీ కొట్టే విలన్ ఎవరై ఉంటారా? అని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఆ లిస్ట్‌లో ఎంతో మంది హీరోల పేర్లు వచ్చాయి. కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖుల పేర్లు వినిపించాయి. చివరకు మాలీవుడ్ గ్రేట్ యాక్టర్ ఫాహిద్ ఫాజిల్‌ను తీసుకొచ్చారు.

ప్రస్తుతం బిజీగా..
ప్రస్తుతం సుకుమార్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. ఫాహిద్ కూడా సీన్‌లోకి ఎంటరైనట్టు తెలుస్తోంది. తాజాగా పుష్ప సెట్‌లో సుకుమార్ ఫ్యామిలీ సందడి చేసింది. సుకుమార్ భార్య తబిత, పిల్లలు పుష్ఫ సెట్‌లో హల్చల్ చేశారు.

సుకుమార్ భార్య..
సుకుమార్ భార్య తబిత.. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పుష్ప సెట్‌లో సుకుమార్ ఎంత బిజీగా ఉన్నాడు.. పిల్లలతో ఎలా గడుపుతున్నాడనే విషయాలను చెప్పుకొచ్చింది. ఇక డాడీ పాత్రలోకి వెళ్లాడు.. ఇక్కడ కూడా నెరేషన్ ఇస్తున్నాడు అంటూ కౌంటర్లువేసింది.

పుష్పపై అంచనాల..
ప్రస్తుతం పుష్ప సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎప్పుడెప్పుడు అప్టేట్లు వస్తాయా? అని ఎదురుచూస్తూనే ఉన్నారు. చావు కబురు చల్లగా ఈవెంట్‌లో సుకుమార్, జానీ మాస్టర్‌లు చేసిన కామెంట్లు పుష్ప మరింత హైప్ పెరిగింది.


Click it and Unblock the Notifications











