అల్లు అర్జున్ పుష్పలో ఎమోషనల్ టచ్.. అంతకుమించి అంటున్న సుకుమార్
బిగ్ బడ్జెట్ సినిమాలలో యాక్షన్ సీన్స్ మసాలా సీన్స్ ఎన్ని ఉన్నా కూడా ఎమోషనల్ టచ్ లేకపోతే అన్ని వర్గాల ఆడియేన్స్ అంత ఈజీగా కనెక్ట్ అవ్వరు. ఇక బాహుబలి, KGF వంటి పాన్ ఇండియా సినిమాలలో ఎమోషనల్ సీన్స్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అదే తరహాలో పుష్ప సినిమాలో కూడా దర్శకుడు సుకుమార్ చాలా బలమైన బావోద్వేగ సన్నివేశాలను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
కెరీర్ మొదట్లో ప్రేమ కథలతోనే ఎక్కువగా ఆకట్టుకున్న సుకుమార్ ఆ తరువాత 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో సినిమాల్లో ఎమోషనల్ డోస్ గట్టిగానే పెంచేశాడు. ఇక రంగస్థలం సినిమాలో బ్రదర్ డేత్ సీన్స్ తో కంటతడి పెట్టించాడు. ఇక నెక్స్ట్ పుష్ప సినిమాలో అంతకు మించి అనేలా భార్యకు సంబంధించిన ఎమోషనల్ సీన్స్ ని క్రియేట్ చేయనున్నాడట. పుష్ప రాజ్ గా కనిపించనున్న అల్లు అర్జున్ కి భార్యగా రష్మీక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కూడా పూర్తిగా రివేంజ్ డ్రామాగానే రూపొందుతున్నట్లు టాక్. ఇప్పటికే కొంత షూటింగ్ ని పూర్తి చేసిన సుకుమార్ వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ ని కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారట. మొత్తానికి భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలను కూడా మిక్స్ చేసి రెడీ చేస్తున్న సుకుమార్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.
ఈ సినిమా అనంతరం సుకుమార్ విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయనున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది పుష్ప సినిమా షూటింగ్ ముగిసిన తరువాత సెట్స్ పైకి రానుంది.


Click it and Unblock the Notifications











